పిక్‌టాక్ : అందాల శ్రద్దా నిలువెత్తు అందం
శ్రద్దా దాస్ సినిమాలతో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కారణంగా వైరల్ అవుతూ ఉంటుంది.
By: Tupaki Desk | 30 Nov 2024 5:30 PM GMT2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్దా దాస్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది. కానీ కాలం కలిసి రాకపోవడంతో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రాలేదు. చేసిన చిన్న సినిమాలు సైతం భారీ విజయాలు సొంతం చేసుకోలేదు. అయితే ఆమె అందం ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండేలా చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు 15 అవుతున్నా ఇప్పటికీ అదే అందం, అదే జోష్ ఆమెలో కనిపిస్తూ ఉంటుంది అంటూ అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి శ్రద్ద అందాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
శ్రద్దా దాస్ సినిమాలతో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కారణంగా వైరల్ అవుతూ ఉంటుంది. కేవలం హీరోయిన్‌గానే నటించాలి అని కాకుండా వచ్చిన ప్రతి ఒక్క అవకాశంను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసే శ్రద్దా దాస్ లేడీ విలన్‌గానూ మెప్పించింది. ఆ మధ్య వరుసగా ఐటెం సాంగ్స్ ఆఫర్లను సైతం అందుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ సినిమాలు చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో వైరల్ అవుతూ, అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లు, చిన్న సినిమాలతో సందడి చేస్తూ వస్తోంది.
సోషల్ మీడియాలో శ్రద్దా షేర్ చేసే ప్రతి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు ఎక్కువగా చీర కట్టు ఫోటోలతో నెటిజన్స్ ను కవ్విస్తూ ఉంటుంది. ఈసారి బ్లూ డ్రెస్‌లో థైస్ అందాలను చూపించడం ద్వారా కన్నుల విందు చేస్తుంది. టైట్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ చాలా అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోలకు జోడీగా నటించగల సత్తా ఉన్న అదం ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఈమె ముందు ముందు అయినా మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
తెలుగు లో సిద్దూ ఫ్రమ్ సికాకుళం సినిమా తర్వాత అధినేత, టార్గెట్, ఆర్య 2, డైరీ ఇంకా పలు సినిమాల్లో నటించింది. కానీ ఏ సినిమాతోనూ స్టార్‌డం రాకపోవడంతో బాలీవుడ్‌లో ప్రయత్నాలు మొదలు పెట్టింది. అక్కడ వచ్చిన ఆఫర్ సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ అది వర్కౌట్ కాలేదు. తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా కన్నడ, బెంగాళి సినిమాల్లో ఈ అమ్మడు ఎక్కువగా నటించింది. కన్నడంలో ఈ అమ్మడికి ఒక మంచి హీరోయిన్ గా గుర్తింపు దక్కింది. దాంతో అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో ఈమెకు చాలానే ఆఫర్లు వచ్చాయి కానీ దక్కాల్సిన గౌరవం, గుర్తింపు, స్టార్‌డం మాత్రం దక్కలేదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.