Begin typing your search above and press return to search.

'పార్ట్ 3'లో చెబుతుంద‌ట‌.. షాక్‌లో అభిమాని!

అయితే ట్విస్ట్ ఏమిటంటే స్ట్రీ 3లోనే త‌న పాత్ర పేరు చెబుతానని చెప్పింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 2:45 AM GMT
పార్ట్ 3లో చెబుతుంద‌ట‌.. షాక్‌లో అభిమాని!
X

'సాహో' బ్యూటీ శ్రద్ధా కపూర్ త‌న కెరీర్ బెస్ట్ విజ‌యాన్ని ఆస్వాధిస్తోంది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సంద‌ర్భంగా ఆగ‌స్టులో విడుదలైన స్త్రీ 2 త‌న‌కు మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా మారింది. మొదటి భాగంలో క‌నిపించిన‌ట్టే, రెండో భాగంలోను మిస్టీరియస్ గర్ల్‌గా తన పాత్రను తిరిగి పోషించింది శ్ర‌ద్ధా. ఇందులోను త‌న పేరును ప్రేక్షకులకు వెల్లడించలేదు. శ్రద్ధా ఇటీవల తన సినిమా నుండి కొన్ని తెరవెనుక గ్లింప్స్‌ని షేర్ చేస్తూ అభిమానులతో సంభాషించింది. అంతేకాదు.. ఈ బ్యూటీ తన పాత్ర పేరును వెల్లడిస్తానని వాగ్దానం చేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే స్ట్రీ 3లోనే త‌న పాత్ర పేరు చెబుతానని చెప్పింది.

ఇన్ స్టాలో స్ట్రీ 2 నుంచి కొన్ని ఫోటోల‌ను షేర్ చేసిన శ్ర‌ద్ధా త‌న పాత్ర లుక్‌లో కొన్ని సెల్ఫీలు, ఫోటోలను రివీల్ చేసింది. వీటిలో దర్శకుడు అమర్ కౌశిక్ శ్ర‌ద్ధాకు చెందిన చోటి (బ్రెడ్)ని మెడకు చుట్టుకుని కూర్చుని కనిపించారు. శ్రద్ధా కొన్ని పోస్టర్‌లను కూడా రిలీజ్ చేసారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల షూటింగ్‌ను కూడా రివీల్ చేసారు. 50 శాతం పూకీ 50 శాతం మారు క్యా??? అనే క్యాప్ష‌న్ ని షేర్ చేసింది శ్ర‌ద్ధా. త‌న‌ పాత్రలకు రెండు పార్శ్వాలు ఉన్న‌ట్టు శ్ర‌ద్ధా రివీల్ చేసింది.

వ్యాఖ్యల విభాగంలో శ్రద్ధా కపూర్ తన అనుచరులతో సరదాగా సంభాషించారు. ఒక వ్యక్తి సినిమాలో మీ పేరు ఏమిటో మాకు చెప్పండి అని అడిగాడు. నేను ఖచ్చితంగా `స్ట్రీ 3`లో చెబుతాను అని వ్యాఖ్యానించింది. మరో అభిమాని ``మీ పోస్ట్ లేకుండా ఆదివారం అసంపూర్తిగా ఉంటుంది`` అని స్వీట్ నోట్ రాసాడు. మిమ్మల్ని ఇక్కడ కామెంట్స్‌లో కలవకుండా నా ఆదివారం కూడా అసంపూర్ణమే అని శ్ర‌ద్ధా అంతే స్వీట్ రిప్ల‌య్ ఇచ్చింది. ఈ పూకీ అంటే ఏమిటి? అని ఒక‌రు అడిగారు. శ్రద్ధా నవ్వుతూ స్పందించింది. మీమ్స్ స్టడీస్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టండి.. మీరు కనుగొంటారు అని అంది. `నేను చప్పుళ్ల‌కు, స్త్రీకి భయపడను` అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, బ్రేడ్ భయాన్ని సృష్టిస్తుంది అని పేర్కొంది. ప్ర‌తిభావంతురాలైన‌ శ్ర‌ద్ధా త‌దుప‌రి మ‌రో తెలుగు సినిమాలో ఎప్పుడు న‌టిస్తుందో వేచి చూడాలి.