'సాహో' శ్రద్ధ పెళ్లి కబురు
ఇంటర్వ్యూలో వివాహ ప్రణాళికల గురించి శ్రద్ధా ప్రశ్న ఎదుర్కొంది. పెళ్లిపై నమ్మకం ఉందా లేదా? అనేది కాదు కానీ, సరైన వ్యక్తిగా ఉండటం .. సరైన వ్యక్తితో ఉండటం గురించి ప్రశ్న ఇది అని భావిస్తాను.
By: Tupaki Desk | 15 Oct 2024 2:30 AM GMT'సాహో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా కపూర్. తనవైన అందచందాలు నటనతో ఆకట్టుకుంది. అంతకుముందు ఆషిఖి 2లో అద్భుత నటనతో భాషా భేధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ 'సాహో' లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించడం ద్వారా తన స్థాయిని ఫాలోవర్స్ ని విస్తరించింది.
ఇటీవల ఈ బ్యూటీ సినిమాలతో కంటే రిలేషన్ షిప్స్ పరంగానే ఎక్కువగా హెడ్ లైన్స్ లోకొస్తోంది. శ్రద్ధా కపూర్ ఇంతకుముందు ఆషిఖి 2 సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్ తో ప్రేమలో ఉందని ప్రచారమైంది. ఆ జంట బ్రేకప్ అయిన తర్వాత దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ తోను ముడిపెట్టి వార్తలు వచ్చాయి. కానీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదని అదే బాలీవుడ్ మీడియా కథనాలు వండి వార్చింది. అటుపైనా పలువురితో శ్రద్ధా కపూర్ ప్రేమాయణం సాగించిందని కూడా ప్రచారం జరిగింది. అందులో ప్రభాస్ పేరు కూడా వినిపించింది. సాహో సమయంలో ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారని ప్రచారమైనా కానీ, అది నిజం కాదని ఆ తర్వాత వారు ఖండించారు.
ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ స్త్రీ 2లో నటించిన శ్రద్ధా కొన్ని నెలలుగా రాహుల్ మోడీ అనే బిజినెస్ మేన్ తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయినా ఈ పుకార్లపై శ్రద్ధా మాట్లాడలేదు. అయితే తాజా ఇంటర్వ్యూలో శ్రద్ధా తాను రిలేషన్లో ఉన్నానని అంగీకరించింది. కాస్మోపాలిటన్కి ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో ''తన భాగస్వామితో గడపడం తనకు చాలా ఇష్టం'' అని శ్రద్ధా తెలిపింది. ''నా భాగస్వామితో సినిమా చూడటం.. డిన్నర్‌కి వెళ్లడం లేదా ప్రయాణం చేయడం వంటి పనులు నాకు చాలా ఇష్టం. నేను సాధారణంగా కలిసి పనులు చేయడానికి లేదా ఒంటరిగా సమయాన్ని గడపడానికి ఇష్టపడే వ్యక్తిని. ఉదాహరణకు నా స్కూల్ ఫ్రెండ్స్ ని కలవకపోయినా అది నా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. నిన్న మేము కుటుంబసమేతంగా భోజనం చేసాం. ఇది చాలా ఎగ్జయిట్ చేసింది. నాతో సంబంధంలో ఉన్నవారితో ఇలాగే ఉంటాను'' అని తెలిపింది.
ఇంటర్వ్యూలో వివాహ ప్రణాళికల గురించి శ్రద్ధా ప్రశ్న ఎదుర్కొంది. పెళ్లిపై నమ్మకం ఉందా లేదా? అనేది కాదు కానీ, సరైన వ్యక్తిగా ఉండటం .. సరైన వ్యక్తితో ఉండటం గురించి ప్రశ్న ఇది అని భావిస్తాను.ఎవరైనా వివాహం చేసుకోవాలని భావిస్తే అది చాలా బాగుంటుంది.. కానీ వారు పెళ్లి చేసుకోకూడదని భావించినా అది కూడా చాలా బాగుంటుంది! అని శ్రద్ధా డ్యూయల్ టోన్ వినిపించింది. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా బాగానే ఉంది కదా! అనేది తన ఉద్ధేశం. శ్రద్ధా కపూర్ 'స్త్రీ 2' భారతదేశంలో అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. షారుఖ్ ఖాన్ జవాన్ జీవితకాల కలెక్షన్లను అధిగమించింది. తదుపరి సినిమాల గురించి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.