Begin typing your search above and press return to search.

ఎలా చూసుకున్నా 'పుష్ప 2'కు శ్రద్ధా ప్లస్సే!

తాజాగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ మూవీలో స్పెషల్ డ్యాన్స్ నంబర్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 10:30 PM GMT
ఎలా చూసుకున్నా పుష్ప 2కు శ్రద్ధా ప్లస్సే!
X

2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ "పుష్ప 2: ది రూల్". ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో ఏడు వారాల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'పుష్ప 2' సినిమాకు సంబంధించిన ప్రతీ విషయం కూడా ఫ్యాన్స్ ను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. తాజాగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఈ మూవీలో స్పెషల్ డ్యాన్స్ నంబర్‌లో కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. ఎందరో స్టార్ హీరోయిన్లను పరిశీలించిన మేకర్స్.. చివరకు శ్రద్ధానే ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. 'సాహో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మరోసారి తెలుగు తెరపై మెరవనుంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్ ఒకరు. ఆమె అందంగా ఉండటమే కాదు, డ్యాన్సులు కూడా బాగా చేస్తుందనే సంగతి తెలిసిందే. అయితే 'పుష్ప 2' లో ఐటమ్ భామగా ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు అభిమానులు. శ్రద్దా డ్యాన్సులు ఇరగదీసినప్పటికీ, భారీ హైప్ ఉన్న ఐటమ్ సాంగ్ కు ఆమె సరిపోతుందో లేదో.. పాటకు తగ్గట్టుగా హావభావాలు పలికించగలదా? అని కామెంట్లు చేస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ప్రత్యేకంగా నిలుస్తాయి. వీరిద్దరూ కలసి చేసిన అన్ని చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ హిట్ అయ్యాయి. 'పుష్ప 1' చిత్రంలో 'ఊ అంటావా మావా' పాట ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప 2' లో ఐటెం పాట కూడా అదే స్థాయిలో ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమా చుట్టూ నెలకొన్న హైప్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఐటమ్ సాంగ్ ఆ రేంజ్ లో లేకపోతే మాత్రం ఆడియన్స్ నిరుత్సాహానికి గురవుతారు. కాబట్టి ఆ సాంగ్ లో ఆడి పాడే ఐటమ్ గర్ల్ కూడా కీలకమనే చెప్పాలి.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే.. 'పుష్ప: ది రైజ్' లో ఐటెమ్ సాంగ్ చేయడానికి ముందు, సమంత రూత్ ప్రభుకు ఐటెం గర్ల్ ఇమేజ్ ఏమీ లేదు. కానీ 'ఊ అంటావా' పాటలో సామ్ తన స్టెప్పులతో, హాట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్ చేసింది. బన్నీతో పోటా పోటీగా డ్యాన్స్ చేసి, పాట అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణమైంది. ఇప్పుడు శ్రద్దా కపూర్ కూడా 'పుష్ప: ది రూల్' ఐటమ్ నంబర్ తో రూల్ చేస్తుందని ఆమె అభిమానులు నమ్ముతున్నారు. ఆల్రెడీ హిందీలో మూడు స్పెషల్ సాంగ్స్ చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ సరైన ట్యూన్ కంపోజ్ చేస్తే, శ్రద్ధా తన పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు.

'పుష్ప 2' ఐటమ్ నంబర్ లో శ్రద్ధా కపూర్ అలరిస్తుందా లేదా అనేది పక్కన పెడితే.. ఈ పాన్ ఇండియా సినిమాకి ఆమె కచ్ఛితంగా ప్లస్ అవుతుంది. శ్రద్ధా ఉండటం హిందీ మార్కెట్ లో బాగా కలిసొస్తుంది. అందులోనూ ఇటీవలే 'స్త్రీ 2' భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. కాబట్టి అల్లు అర్జున్ సినిమాకి శ్రద్ధా కపూర్ తప్పకుండా అదనపు ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. అసలు ఇవన్నీ ఆలోచించే సుక్కూ ఆమెను స్పెషల్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకున్నారేమో!