పాన్ ఇండియాలో 3డి నాగినిని చూపిస్తారా?
అయితే ఇప్పుడు ఆషిఖి 2, సాహో, స్త్రీ 2 లాంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కొల్టగొట్టిన శ్రద్ధా కపూర్ నాగిన్ పాత్రలో నటిస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది.
By: Tupaki Desk | 15 Jan 2025 6:25 AM GMTబాలీవుడ్ క్లాసిక్ `నాగిన్`గా అతిలోక సుందరి శ్రీదేవి అద్భుతంగా నటించారు. హిందీ బుల్లితెరపై నాగిని పాత్రలో మౌనిరాయ్ నట ప్రదర్శనను పరిచయం చేయాల్సిన పని లేదు. తెలుగులో యమున నాగిని పాత్రలో నటించి మెప్పించారు. ఇంకా చాలా మంది నటీమణులు వివిధ భాషల్లో నాగిని పాత్రల్లో రంజింపజేసారు.
అయితే ఇప్పుడు ఆషిఖి 2, సాహో, స్త్రీ 2 లాంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలను కొల్టగొట్టిన శ్రద్ధా కపూర్ నాగిన్ పాత్రలో నటిస్తుండడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. శ్రద్ధా అమాయకమైన ముఖం.. అందమైన ఎక్స్ ప్రెషన్స్ ఈ పాత్రకు ప్రధాన బలంగా మారనున్నాయని అభిమానులు భావిస్తున్నారు.
హారర్ కామెడీలతో అలరించిన శ్రద్దా, ఇప్పుడు సర్పంగా తెరపై కనిపించనుండడం అభిమానుల్లోను ఉత్కంఠ పెంచుతోంది. తాజా ఇంటర్వ్యూలో శ్రద్ధా మాట్లాడుతూ.. తాను ఈ పాత్రను పోషించడానికి శ్రీదేవిని స్ఫూర్తిగా తీసుకుంటున్నానని, నాగిన్ గా శ్రీదేవి నటనను చూస్తూ పెరిగానని కూడా వెల్లడించింది.
సంక్రాంతి సందర్భంగా `నాగిన్: యాన్ ఎపిక్ టేల్ ఆఫ్ లవ్ & సాక్రిఫైస్` గురించి వెల్లడించారు మేకర్స్. సాఫ్రాన్ మ్యాజిక్ వర్క్స్ ఈ సినిమా కంటెంట్ ని అభివృద్ధి చేస్తోంది. ఇప్పుడు నాగదేవత కథలను తిరిగి తెరపైకి తెచ్చే ఆలోచన బావుంది. చాలా కాలంగా మరుగున పడిపోయిన ఈ జానర్ ని తిరిగి టచ్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే మరుగున పడిన అందమైన పౌరాణిక జానపద కథల్ని తిరిగి పెద్ద తెరపైకి తెచ్చే ప్రయత్నాన్ని ఎప్పుడూ అభినందించాలి.
మారిన ట్రెండ్ లో పాన్ ఇండియన్ స్కేల్ లో భారీ విజువలైజేషన్ తో నాగు పాము (నాగినులు) కథల్ని తెరకెక్కిస్తే ఆ విజువల్ బ్యూటీని ఆస్వాధించడానికి ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. 3డిలో, ఐమ్యాక్స్ లో ఇలాంటి థ్రిల్లర్ నాగిని కథల్ని చూసే అవకాశం కల్పిస్తే అది ఇంకా ఉత్కంఠను కలిగిస్తుంది. పాత కాలం నాగిని కథలు విసుగొచ్చేశాయి గనుక ఇప్పుడు కచ్ఛితంగా ఆడియెన్ 3డిలో జెన్-జెడ్ నాగిని విజువల్స్ ని మాత్రమే ఆశిస్తున్నారని మేకర్స్ గ్రహిస్తే నే బాక్సాఫీస్ కి మంచిది. జెన్ జెడ్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో 3డి నాగినిని చూపిస్తారా? అన్నది వేచి చూడాలి.