'సాహో' శ్రద్ధా - రాహుల్ ప్రేమకథ ఒక కొలిక్కి
అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన పెళ్లి వేడుక నుండి శ్రద్ధా - రాహుల్ హాజరైన వీడియో కూడా ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ అయింది.
By: Tupaki Desk | 25 Feb 2025 7:30 PM GMTబాలీవుడ్ అందాల నటి శ్రద్ధా కపూర్ .. తన ప్రియుడు, రచయిత రాహుల్ మోడీ ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఒక వివాహానికి హాజరయ్యారు. వివాహం తర్వాత ఈ జంట విమానంలోని ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో ఈ అందమైన జంట ఎంతో ముచ్చటగా కనిపించింది. రాహుల్ తెల్ల చొక్కాలో స్మార్ట్ గా కనిపించగా, శ్రద్ధా ట్రెడిషనల్ లుక్ లో ఎంతో ముచ్చటగొలుపుతోంది. ఆ ఫోటోలో శ్రద్ధా తన ఫోన్‌లో రాహుల్‌కు ఏదో చూపిస్తూ ఉంది. అంతకుముందు అహ్మదాబాద్‌లో జరిగిన పెళ్లి వేడుక నుండి శ్రద్ధా - రాహుల్ హాజరైన వీడియో కూడా ఇంటర్నెట్‌లో విస్తృతంగా షేర్ అయింది.
తన సినిమా 'తు జీతూ మై మక్కర్' రచయిత రాహుల్‌తో తన సంబంధాన్ని శ్రద్ధా ఇంకా ధృవీకరించాల్సి ఉంది. కాస్మోపాలిటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధా అతడితో డేటింగ్ చేస్తున్నట్లు ధృవీకరించింది. శ్రద్ధా తన భాగస్వామితో విలువైన సమయాన్ని గడపడాన్ని ఆస్వాధిస్తున్నట్టు తెలిపింది. నా భాగస్వామితో సమయం గడపడం .. అతడితో కలిసి పనులు చేయడం, సినిమా చూడటం, విందుకు వెళ్లడం లేదా ప్రయాణం చేయడం వంటివి నాకు చాలా ఇష్టం.. అని తెలిపింది.
మేం సాధారణంగా కలిసి పనులు చేయడం.. కలిసి ఏ పనీ చేయకుండా సమయం గడపడానికి ఇష్టపడతాం. నా పాఠశాల స్నేహితులను కలవకపోయినా నా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని శ్రద్ధా తెలిపింది. జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ వేడుకలోను శ్రద్ధా -రాహుల్ కలిసి కనిపించారు. శ్రద్ధా స్వయంగా అతడిని ఆదిత్య రాయ్ కపూర్‌కు పరిచయం చేయడం కూడా కనిపించింది. స్త్రీ 2 ఘన విజయం సాధించిన తర్వాత శ్రద్ధా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ప్రియుడితో ఎక్కువ సమయం గడిపేందుకు వెచ్చిస్తోంది.