ఇప్పటికీ 25 ఏళ్ల అమ్మాయిలా 40 వయసు నటి!
`సాహో` లాంటి భారీ యాక్షన్ చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించింది శ్రద్ధా కపూర్.
By: Tupaki Desk | 11 Feb 2025 6:58 AM GMT`సాహో` లాంటి భారీ యాక్షన్ చిత్రంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ సరసన నటించింది శ్రద్ధా కపూర్. అంతకుముందు బాలీవుడ్‌లో ఆషిఖి 2, ఏక్ విలన్ సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రద్ధాకు అసాధారణ ఫాలోయింగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాల్లో చాలా మంది అగ్ర హీరోలను మించిన ఫాలోయింగ్ ని శ్రద్ధా ఆస్వాధిస్తోంది.
![](https://content.tupaki.com/h-upload/2025/02/11/689921-sr1.gif)
శ్రద్ధా ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్‌లో పలువురు అగ్ర హీరోల సరసన నటించేందుకు సంతకాలు చేస్తోందని కథనాలొస్తున్నాయి. హృతిక్ రోషన్ క్రిష్ 4లో శ్రద్ధా కథానాయికగా నటించనుందని కథనాలొచ్చాయి. తదుపరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న `వార్ 2`లో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ లతో కలిసి స్పెషల్ నంబర్ లో శ్రద్ధా నర్తిస్తుందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇంతకుముందు పుష్ప 2లో ఐటమ్ నంబర్ కోసం సంప్రదించినా అప్పట్లో కాదని అనుకుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తో స్పెషల్ నంబర్ కోసం ఓకే చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్త్రీ 2 లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన శ్రద్ధా ఆచితూచి కథలు, పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటివరకూ తన తదుపరి పెద్ద సినిమా గురించి వివరాల్ని వెల్లడించలేదు.
మరోవైపు శ్రద్ధా వరుస ఫోటోషూట్లు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ మ్యాగజైన్ `ది నాడ్` కవర్ పేజీపై రెబల్ క్వీన్ లుక్ లో శ్రద్ధా అద్భుతంగా కనిపించింది. ఈ బ్యూటీ బ్లాక్ బ్లేజర్ లో స్ట్రైకింగ్ ఫోజులతో కట్టి పడేస్తోంది. ముఖ్యంగా తన పొడుగు కాళ్ల సొగసును ఆవిష్కరిస్తూ బోల్డ్ గా ఇచ్చిన ఫోజ్ యువతరంలోకి దూసుకెళుతోంది. ది నాడ్ మ్యాగజైన్ ప్రత్యేక కథనంలో శ్రద్ధా ప్రతిభ గురించి ప్రశంసలు కురిపించింది.
ఈ ఫోటోషూట్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రద్ధా వయసు 40 దాటుతోంది కానీ ఇప్పటికీ ఆమె బాలీవుడ్‌లో భారీ మేకప్ వేసుకునే 90 శాతం మంది నటీమణుల కంటే చాలా బాగుంటుందని `ది నాడ్` మ్యాగజైన్ స్టిల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్రద్ధా ఎప్పటికీ తన స్టార్‌డమ్‌ను అలాగే కొనసాగిస్తుంది... తక్కువ సినిమాలు చేస్తుంది కానీ అవి పెద్ద హిట్లుగా మారతాయి. శ్రద్ధా కపూర్ ప్రజాదరణను మరింత పెంచుతాయి. ప్రస్తుతం స్ట్రీ 2 ఘనవిజయం తర్వాత కెరీర్ పరంగా శిఖరాగ్రంలో ఉంది.. అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. శ్రద్ధా ఇప్పటికీ 25 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుందని ఒక నెటిజన్ ఈ ఫోటో చూశాక కామెంట్ చేసారు.