ఫీమేల్ హ్యారీపోటర్.. శ్రద్ధాకు కితాబు
నేడు దేశంలోని అత్యంత భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాల్ని శ్రద్ధా అందుకుంటోంది.
By: Tupaki Desk | 2 Feb 2025 10:30 AM GMTభారతదేశంలోని అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన నటిగా శ్రద్ధా కపూర్ కి గుర్తింపు ఉంది. శక్తికపూర్ నటవారసురాలిగా సినీపరిశ్రమలో అడుగుపెట్టినా కానీ తనదైన స్టైల్, ప్రతిభతో ఈ భామ సత్తా చాటింది. బాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా నిలదొక్కుకుంది. నేడు దేశంలోని అత్యంత భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాల్ని శ్రద్ధా అందుకుంటోంది.
ముఖ్యంగా శ్రద్ధా కపూర్ అందం, ఆహార్యానికి ఫిదా కాని అభిమాని లేడు. సోషల్ మీడియాల్లో కోటి మంది పైగా అభిమానులున్నారు. శ్రద్ధా నిరంతరం తన ఇన్‌స్టా, డిజిటల్ పోస్టులతో కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. కళ్లజోడు, భారీ కోట్ ధరించిన శ్రద్ధాను చూడగానే 'ఫీమేల్ హ్యారీపోటర్' అంటూ అభిమానులు కితాబిచ్చేశారు. శ్రద్ధా ధరించిన కళ్లజోడు, డ్రెస్ కోడ్ అచ్చం హ్యారీపోటర్ ని తలపించడంతో అభిమానులు సరదాగా ఫీమేల్ హ్యారీపోటర్ అని పిలిచేస్తున్నారు. బుర్గుండి స్పోర్ట్స్ జాకెట్‌లో సూపర్ క్యూట్‌గా కనిపించిన శ్రద్ధా ఇదే ఫోటోషూట్ లో థై స్లిట్ ఫ్రాకులో కనిపించి ఆశ్చర్యపరిచింది. తాజా ఫోటోషూట్ కి శ్రద్ధా 'ట్రయల్ రన్' అంటూ అందమైన క్యాప్షన్ ని ఇచ్చింది. సంవత్సరంలో మొదటి నెల ఎల్లప్పుడూ టెస్ట్ రన్ లాగా అనిపిస్తుందని తన అభిమానుల్లో చాలామంది అంగీకరించారు. శ్రద్ధా అందమైన వ్యక్తిత్వం సరదా పరాచికాలు అభిమానులను నవ్విస్తూనే ఉన్నాయి.
కెరీర్ మ్యాటర్ కి వస్తే గత ఏడాది 'స్త్రీ 2' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రద్ధా ప్రస్తుతం నాగిన్ గా నటించేందుకు సిద్ధమవుతోంది. రణ్ వీర్- ఫర్హాన్ కాంబినేషన్ లోని మోస్ట్ అవైటెడ్ డాన్ 3లో, అలాగే హృతిక్ క్రిష్ 4లో శ్రద్ధా కథానాయికగా నటిస్తుందని కథనాలొస్తున్నాయి. తన తదుపరి భారీ చిత్రం గురించి ప్రకటన వెలువడ నుందని కూడా తెలుస్తోంది.