కన్నడ బ్యూటీకి మరో కేకపెట్టించే ఛాన్స్..
కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లతో అదరగొట్టేస్తుంది. కన్నడలో ఆల్రెడీ తన సత్తా చాటుతూ వస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నానితో జెర్సీ సినిమా చేసింది
By: Tupaki Desk | 14 Jan 2025 2:30 AM GMTకన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లతో అదరగొట్టేస్తుంది. కన్నడలో ఆల్రెడీ తన సత్తా చాటుతూ వస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ తెలుగులో నానితో జెర్సీ సినిమా చేసింది. జెర్సీలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత ఆది సాయి కుమార్ తో ఒక సినిమా చేసినా వర్క్ అవుట్ కాలేదు. లాస్ట్ ఇయర్ సైంధవ్ తో ఛాన్స్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ ఛాన్స్ అందుకుంది. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
డాకు మహారాజ్ హిట్ తో శ్రద్ధా క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు అమ్మడికి మరో లక్కీ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో శ్రద్ధ కూడా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. రజిని నెల్సన్ కలిసి చేసిన జైలర్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ కాంబోలో ఆ సినిమా సీక్వెల్ గా జైలర్ 2 వస్తుంది. జైలర్ 2 సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ లక్కీ ఆఫర్ అందుకుంది.
శ్రద్ధ శ్రీనాథ్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కి ఎంపికైనట్టు తెలుస్తుంది. శ్రద్ధ శ్రీనాథ్ తో పాటు జైలర్ 2 లో తమన్నా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ రజినికి చాలా కాలం తర్వాత సూపర్ హిట్ సినిమాగా జైలర్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఐతే ఈ సినిమా సీక్వెల్ ని కూడా అంతకుమించి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సీక్వెల్ లో శ్రద్ధ పాత్ర ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని తెలుస్తుంది.
కన్నడలో తన మార్క్ టాలెంట్ చూపిస్తూ వస్తున్న అమ్మడు ఇప్పుడిప్పుడే తెలుగులో బిజీ అవుతుంది. ఇక ఇప్పుడు తమిళ్ లో కూడా తన పంథా కొనసాగించాలని చూస్తుంది. టాలెంట్ ఉన్నా కూడా సరైన ఛాన్స్ లు రాని శ్రద్ధాకి తెలుగు, తమిళ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. తప్పకుండా అమ్మడు రాబోయే సినిమాలతో అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. శ్రద్ధ శ్రీనాథ్ ఇక మీదట తన వరుస సినిమాలతో సౌత్ ఆడియన్స్ ని అలరించేలా క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తుందని చెప్పొచ్చు.