Begin typing your search above and press return to search.

జెర్సీ హీరోయిన్.. బిజీగా ఉన్నా సౌండ్ లేదేంటి?

అయితే సౌత్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 6:30 AM GMT
జెర్సీ హీరోయిన్.. బిజీగా ఉన్నా సౌండ్ లేదేంటి?
X

తెలుగులో జెర్సీ సినిమాలో నానికి జోడీగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ని అంత ఈజీగా ఎవరు మరిచిపోరు. ఈ కన్నడ బ్యూటీ జెర్సీ చిత్రంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అమ్మడు కోహినూర్ అనే మలయాళం మూవీతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. అయితే కన్నడంలో చేసిన యూటర్న్ శ్రద్ధా శ్రీనాథ్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత కన్నడ, మలయాళీ, తమిళ్ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. జెర్సీ సినిమాతో తెలుగులోకి ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ తన పెర్ఫార్మెన్స్ తో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ తరువాత తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు సొంతం చేసుకోలేకపోయింది. ఆది సాయికుమార్ తో జోడీ అనే సినిమాలో నటించింది. తరువాత సిద్ధూ జొన్నలగడ్డ కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలో ఒక హీరోయిన్ గా కనిపించింది. తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోయిన కూడా శ్రద్ధా శ్రీనాథ్ తమిళ్, కన్నడ భాషలలో మాత్రం వరుస సినిమాలు చేస్తోంది.

గత ఏడాది తమిళంలో వచ్చిన ఇరంగపట్రు సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది సైంధవ్ మూవీలో వెంకటేష్ కి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. త్వరలో మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల రాబోతోంది. మంచి టాలెంటెడ్ యాక్టర్ గా పేరున్న కూడా తెలుగులో మాత్రం ఆమె కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది.

అయితే సౌత్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న వారిలో శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. గ్లామర్ బేస్డ్ రోల్స్ మాత్రం చేయలేదు. కథలు కూడా సెలక్టివ్ గా ఎంపిక చేసుకుంటుంది. కచ్చితంగా తన పాత్రకి ప్రాధాన్యత ఉంది అనుకుంటేనే ఆమె ఒప్పుకుంటుంది. మేగ్జిమమ్ ఆమె నటించిన సినిమాలలో చాలావరకు డీసెంట్ రోల్స్ ఉంటాయి.

అయితే ఆమె ఏదో ఒక సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ బిగ్ సక్సెస్ అయితే ఇంతవరకు రాలేదు. చేసిన సినిమాలు తక్కువే అయిన కూడా నటిగా మాత్రం శ్రద్ధా శ్రీనాథ్ బలమైన ముద్ర వేసుకుంది. సినిమాలో చేసే పాత్రలకి పూర్తి భిన్నంగా బయట ఈ బ్యూటీ గ్లామర్ అవుట్ ఫిట్ లతో ఇన్ స్టాగ్రామ్ లో సందడి చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం అమ్మడి హోప్స్ అన్ని కూడా విశ్వక్ సేన్ మేకనిక్ రాఖీ సినిమాపైనే ఉన్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టొరీగా రానున్న ఈ సినిమాపై ఆడియెన్స్ లో మంచి బజ్ ఉంది. కాబట్టి కమర్షియల్ గా క్లిక్కయ్యే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో అయినా జెర్సీ బ్యూటీ రాత మారుతుందేమో చూడాలి.