బాలయ్యను `బాల` అంటూ ముద్దుగా పిలిచిన హీరోయిన్!
తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్` చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ కూడా నటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jan 2025 7:43 AM GMTనటసింహ బాలకృష్ణ పేరెత్తితే అంతా భయపడతారు. ఆయన ఫేస్ లో సీరియస్ నెస్ చూసి దూరంగా ఉండటానికే చాలా మంది ట్రై చేస్తారు. ఇది అందిరికీ తెలిసిన విషయమే. కానీ బాలయ్య ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలా ఉంటుందన్నది ఆయన దగ్గర ఉన్న వాళ్లకు, ఆయనతో కలిసి పనిచేసిన వారికి మాత్రమే బాగా తెలుసు. ఆయనెంత సీరియస్ గా ఉంటారో ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారో అంతకు రెండింతలు ఎక్కువగా ప్రేమాభిమానం ఎదుట వారిపై చూపించడం మాత్రం ఆయనకే చెల్లింది.
అందుకే బాలయ్యతో పనిచేసిన వారంత తప్పక తమ అనుభవాన్ని పంచుకుంటారు. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన `డాకు మహారాజ్` చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ కూడా నటించిన సంగతి తెలిసిందే. మరి శ్రద్దా శ్రీనాథ్ బాలయ్యను ఎంత ముద్దుగా పిలిచిందో తెలిస్తే షాక్ అవుతారు. బాలయ్య-శ్రద్దా మద్య అంత ర్యాపో ఉందా? అని స్టన్ అవ్వడం ఖాయం అవును. ఈ విషయం గురించి స్వయంగా శ్రద్ధా శ్రీనాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బాలకృష్ణ గారు సెట్ లో తోటి నటులతో ఎంతో సరదాగా ఉంటారు. ఆయన్ని సర్ అని పిలిస్తే కొపం వస్తుంది. అలా ఒకసారి నేను సర్ అని పిలిస్తే కోపడ్డారు. ఆ పిలుపేంటి? బాల అని పిలువు అని చెప్పారు. అలా పిలిస్తేనే ఆయనకు ఎంతో ఇష్టం. చాలా సరదాగా ఉండే మనిషి. ఆయన సెట్ లో కి వస్తే అంతా ఉత్సాహమే. ఎంతో సీనియర్ నటుడైనా దర్శకుడు చెప్పింది ఎంతో శ్రద్దగా వింటారు. చాలా సినిమాల్లో నటించాను అనే భావన ఎక్కడా చూపించరు` అంది.
బాలయ్యతో పనిచేసిన హీరోయిన్లు ఎంతో స్నేహంగా మెలుగుతారు. ఇదే రకమైన ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసు కుంటారు. గతంలో ప్రగ్యా జైశ్వాల్, సోనాల్ చౌహాన్ ఇలా కొంత మంది భామలు బాలయ్య మంచి తనం గురించి ఎన్నో సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. ప్రగ్యా జైశ్వాల్ బాలయ్య హీరోగా నటిస్తోన్న ` అఖండ తాండవం`లోనూ నటిస్తోన్న సంగతి తెలిసిందే.