Begin typing your search above and press return to search.

బంధువులకు కౌంటర్ ఇచ్చిన హీరోయిన్!

క‌న్న‌డ బ్యూటీ శ్ర‌ద్దా శ్రీనాధ్ కూడా ఇలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్న‌ట్లు తెలిపింది. ఇండస్ట్రీకి వెళ్లిన కొత్త‌లో ఏడాది కూడా ఉండ‌లేద‌ని త‌న బంధువులంతా హేళ‌న చేసారట‌.

By:  Tupaki Desk   |   28 Jan 2025 5:30 PM GMT
బంధువులకు కౌంటర్ ఇచ్చిన హీరోయిన్!
X

సినిమా ఇండ‌స్ట్రీ అంటే గ్యారెంటీ లేని లైఫ్. అందుకే సినిమాల్లోకి వెళ్తానంటే ఎవ‌రూ ప్రోత్స‌హించ‌రు. బాగా చ‌దువుకుని మంచి ఉద్యోగం చూసుకుని పిల్ల‌ని చూసి పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డు అని ఓ స‌ల‌హా ఇస్తారు. అలా వాళ్ల మాట కాద‌ని సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయితే ప‌ర్వాలేదు. లేదంటే విమ‌ర్శ‌లు...అవ‌మానాలు...హేళ‌న‌లు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ భాష‌లోనైనా ఫెయిలైన ప్ర‌తీ ఒక్క‌రు ఈ ఫేజ్ చూడాల్సిందే.

క‌న్న‌డ బ్యూటీ శ్ర‌ద్దా శ్రీనాధ్ కూడా ఇలాంటి విమ‌ర్శ‌లు ఎదుర్కున్న‌ట్లు తెలిపింది. ఇండస్ట్రీకి వెళ్లిన కొత్త‌లో ఏడాది కూడా ఉండ‌లేద‌ని త‌న బంధువులంతా హేళ‌న చేసారట‌. సినిమాల్లో రాణించాలంటే చాలా ట్యాలెంట్ ఉండాలి. అది అంద‌రితో సాధ్యం కాదు. ఇవ‌న్నీ నీకెందుకు అన్న‌ట్లు మాట్లాడారట‌. వాళ్లు అన్న‌ట్లు గానే కెరీర్ ప్రారంభ‌మైన కొత్త‌లో బంధువుల నుంచి చాలా మాట‌లు ప‌డాల్సి వ‌చ్చిందట‌.

అయితే ఇప్పుడు తానెంత బిజీగా ఉన్నానో కూడా వాళ్లంతా ఇప్పుడు చూడాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని అంటోంది. ఆ నాడు విమ‌ర్శించినోళ్లే నేడు ప్ర‌శంసించాల్సిన బాధ్య‌త కూడా ఉంది. కానీ ఆ ప‌ని చేయ‌డం లేదు. ఇప్పుడు కొత్త‌గా స‌క్సెస్ అయ్యాన‌నే అక్క‌సుతో ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ఎద‌గ‌నీయ‌కుండా ఎక్క‌డో బ‌య‌ట వాళ్లు కాళ్లు లాగాల్సిన ప‌నిలేదు. ఇంట్లో ఉన్న వారే అప్పుడ‌ప్పుడు ఇలాంటి చ‌ర్య‌ల‌కు దిగుతారు.

అలాంటి వారితో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది. అమ్మ‌డు తొలుత మాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అటుపై క‌న్న‌డ‌, త‌మిళ్ లో సినిమాలు చేసింది. ` జెర్సీ` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో న‌టిగా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. అప్ప‌టి నుంచి తెలుగు సినిమాల్లో కొన‌సాగుతోంది. ఇటీవ‌లే `డాకు మ‌హారాజ్` తో మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకుంది.