Begin typing your search above and press return to search.

శ్రద్దాకి ఆ సినిమాలపై మోజు.. ఛాన్స్ దక్కేనా?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రద్దా శ్రీనాథ్ మాట్లాడుతూ... తనకు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టం అని, అలాంటి సినిమా కథలతో తన వద్దకు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ దర్శక నిర్మాతలకు ఇండైరెక్ట్‌గా సూచించింది.

By:  Tupaki Desk   |   30 Nov 2024 6:30 AM GMT
శ్రద్దాకి ఆ సినిమాలపై మోజు.. ఛాన్స్ దక్కేనా?
X

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'డాకు మహారాజ్‌' సినిమాలో ఒక హీరోయిన్‌గా శ్రద్దా శ్రీనాథ్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి రాబోతున్న ఆ సినిమాపై శ్రద్దా చాలా ఆశలు పెట్టుకుంది. ఇటీవలే శ్రద్దా 'మెకానిక్‌ రాకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. అయితే నటిగా ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టింది. నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా శ్రద్దా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇంకా కమర్షియల్‌ హీరోయిన్‌గా శ్రద్దా నిలదొక్కుకోలేక పోయింది. కారణం ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్రద్దా శ్రీనాథ్ మాట్లాడుతూ... తనకు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలు, సోషియో ఫాంటసీ సినిమాలంటే చాలా ఇష్టం అని, అలాంటి సినిమా కథలతో తన వద్దకు వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ దర్శక నిర్మాతలకు ఇండైరెక్ట్‌గా సూచించింది. అయితే అలాంటి కథలతో ఈమె వద్దకు ఏ దర్శకుడు నిర్మాత వెళ్తాడు అనేది చూడాలి. శ్రద్దా శ్రీనాత్‌ స్కిన్‌ షోకి దూరంగా ఉండటంతో పాటు, పాత్ర విషయంలో చాలా కండీషన్స్ పెడుతుంది అంటూ గతంలో టాక్ ఉండేది. ఇప్పుడు ఈ అమ్మడు కథ విషయంలో పాత్రల విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా సినిమాలు చేస్తుందని ఈ మధ్య కాలంలో కమిట్‌ అయిన సినిమాలను చూస్తే అర్థం అవుతుంది.

సోషల్‌ మీడియాలో ఇతర హీరోయిన్స్‌ జోరుగా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటే ఈమె మాత్రం చాలా ఆరుదుగా మాత్రమే ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా సినిమాల్లోనూ సీరియస్ పాత్రలు ఎక్కువ ఎంపిక చేసుకోవడంతో పాటు, కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉండే పాత్రలకు దూరంగా ఉంటుంది. లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకే ఈమె సెట్‌ అవుతుందా అనే అనుమానం కలిగేలా కొన్ని సినిమాలను ఈమె ఎంపిక చేసుకుంటూ ఉంటుంది అంటూ మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతూ ఉంటుంది.

మొత్తానికి శ్రద్దా శ్రీనాథ్ చాలా కాలం తర్వాత బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. మెకానిక్‌ రాకీ సినిమా నిరాశ పరచినా సంక్రాంతికి రాబోతున్న డాకు మహారాజ్ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్స్‌కి మంచి ప్రాముఖ్యత ఉంటుందని, కనుక ఈ సినిమాతో శ్రద్దా కి కచ్చితంగా కమర్షియల్‌ బ్రేక్‌ దక్కడం ఖాయం అనే అభిప్రాయంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. డాకు మహారాజ్ హిట్‌ అయితే ఈమె కోరుకున్నట్లుగా సైన్స్ ఫిక్షన్‌, సోషియో ఫాంటసీ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కేనా చూడాలి.