Begin typing your search above and press return to search.

ఆమె న‌వ్వితే దెయ్యంలా.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ పై ఫైర్!

అమ‌ర్ కౌశిక్ మాట్లాడుతూ, ''శ్రద్ధ ఎంపికకు సంబంధించిన క్రెడిట్ పూర్తిగా దినేష్ విజన్‌కే చెందుతుంది .

By:  Tupaki Desk   |   6 April 2025 7:37 AM
ఆమె న‌వ్వితే దెయ్యంలా.. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ పై ఫైర్!
X

'సాహో' శ్ర‌ద్ధ ఇంకా తెలుగు అభిమానుల గుండెల్లోంచి దూరంగా వెళ్ల‌లేదు. సౌత్ లో ఈ భామ‌కు స్థిర‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆషిఖి 2తో శ్ర‌ద్ధా అందం న‌ట‌నాభిన‌యం సౌత్ లోను యువ‌త‌రాన్ని మ‌త్తులోకి దించింది. ఇటీవ‌ల స్త్రీ2లో మ‌రో లెవ‌లేంటో చూపించింది ఈ ప్ర‌తిభావ‌ని. దీపిక‌, ఆలియా లాంటి టాప్ స్టార్లు ఉన్న ఈ ఇండ‌స్ట్రీలో శ్ర‌ద్దా త‌న కెరీర్ బండిని తెలివిగా ముందుకు న‌డుపుతోంది.

2024లో విడుద‌లైన 'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అమర్ కౌశిక్ ఈ చిత్రంలో శ్ర‌ద్ధా న‌ట ప్ర‌ద‌ర్శ‌న గురించి మాట్లాడుతూ చేసిన ఓ క‌మెంట్ యూత్ లో వైర‌ల్ గా మారింది. స్త్రీ 2 కోసం ఎంపిక చేయ‌డానికి శ్ర‌ద్ధా అర్హ‌త‌లేమిటి? అన్న ప్ర‌శ్న‌కు.. అత‌డు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు.

అమ‌ర్ కౌశిక్ మాట్లాడుతూ, ''శ్రద్ధ ఎంపికకు సంబంధించిన క్రెడిట్ పూర్తిగా దినేష్ విజన్‌కే చెందుతుంది . ఆ ఇద్దరూ విమానంలో కలుసుకున్నారు. ఆమె నవ్వినప్పుడు సరియైన‌ స్త్రీలా, ఆ మంత్రగత్తెలా కనిపిస్తుందని ఆయన నాతో అన్నారు. అదేంటో నాకు క‌చ్చితంగా తెలియదని ఆయన అన్నారు'' అని అన్నారు. ఈ వ్యాఖ్య విన్న వెంట‌నే ఇప్పుడు శ్ర‌ద్ధా అభిమానులు ఆ ఇద్ద‌రినీ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇలాంటి స్త్రీ ద్వేష పురుషులు శ్ర‌ద్ధా పనిని లేదా నటనను ఎప్పుడూ అభినందించరు కానీ వారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి!! అని ఒక‌రు వ్యాఖ్యానించ‌గా, ''కోట్లు సంపాదించండి.. కూల్‌గా అనిపించడానికి ఇంటర్వ్యూలలో ఆమెను ఎగతాళి చేయండి!'' అని మ‌రొక‌రు విమ‌ర్శించారు. మీరు మీ కథానాయిక గురించి ఇలా మాట్లాడుతారా?? మొదట ఆమె పేరు మీద సినిమాను ప్రమోట్ చేశారు. తర్వాత షిట్! శ్రద్ధాను ఇలా అనేసారు! అని ఇంకో అభిమాని వ్యాఖ్యానించారు. స్త్రీ 2 బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 700కోట్లు వ‌సూలు చేసింది.