మాజీలిద్దరు మళ్లీ బ్యాచిలర్ అయ్యేనే!
అలా ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ద కపూర్ మళ్లీ ఏకాకులుగా మారారు. ప్రస్తుతం ఇద్దరు బాలీవుడ్ లో తోడు లేని బ్యాచిలర్స్.
By: Tupaki Desk | 10 Aug 2024 6:13 AM GMTఆదిత్యారాయ్ కపూర్-శ్రద్దాకపూర్ మధ్య ఏ రేంజ్ లవ్ స్టోరీ నడిచిందో తెలిసిందే. 'ఆషీకీ-2' లో ఆన్ స్క్రీన్ పై రొమాంటిక్ లవ్ స్టోరీలో కలిసి నటించి...ఇద్దరు రియల్ లవ్ స్టోరీలో మునిగిపోయారు. కొన్నాళ్ల పాటు బాలీవుడ్ లో బెస్ట్ లవర్స్ గా కొనసాగారు. ఇద్దరి మధ్య అన్యోన్యత చూసి పెళ్లి చేసుకోవడం ఖాయమ నుకున్నారు. ఇద్దరి మధ్య అంతటి సీరియస్ లవ్ ట్రాక్ నడిచింది అప్పట్లో. కానీ కాలం ఆ ప్రేమను దూరం చేసింది.
ఇద్దరి మద్య ఎడబాటు మొదలవ్వడంతో బ్రేకప్ తో వేరయ్యారు. ఆ తర్వాత ఎవరి ప్రయాణం వారిది అన్నట్లుగా ముందుకు సాగారు. చాలా కాలం పాటు మళ్లీ లవ్ లో పడింది లేదు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆదిత్యా రాయ్ కపూర్...యువ నాయిక అనన్యా పాండేకి దగ్గరయ్యాడు. వీళ్లిద్దరి మధ్య కూడా ప్రేమ పరుగులే పెట్టింది. పరిచయం స్నేహంగా మారడం..అటుపై అది ప్రేమగా రూపంతరం చెందడంతో? బాండింగ్ మరింత బలపడింది. కానీ అది కూడా కొంత కాలమేనని బ్రేకప్ తో జనాలకు అర్దమైంది.
ఇటీవలే ఈ జోడీ కూడా వేరయ్యారు. బ్రేకప్ పార్టీని సైతం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రత్యేకంగా స్నేహితుల్ని ఆహ్వానించి మరీ విడిపోతున్నామని చెప్పి పుల్లుగా పార్టీ ఎంజాయ్ చేసారు. సరిగ్గా ఇదే సమయంలో శ్రద్దాకపూర్ కూడా రాహుల్ మోడీతో సీరియల్ లవ్ లో ఉన్నట్లు నెట్టింట ప్రచారం ఊపందుకుంది. కలిసి పార్టీలకు వెళ్లడం...వెకేషన్లకు వెళ్లడం..ఎయిర్ పోర్టులో జంటగా చిక్కడం వంటి సన్నివేశాలో వీళ్లిద్దరి మధ్య వీడదీయరాని బంధం ఏర్పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
అయితే ఇది కూడా మూడు నాళ్ల ముచ్చటేనని గత నెలలోనే తేలిపోయింది. రాహుల్ మోడీని శ్రద్దా కపూర్ ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడంతో ఇది తెగిపోయిన బంధమేనని మీడియాలో హైలైట్ అయింది. అలా ఆదిత్యారాయ్ కపూర్-శ్రద్ద కపూర్ మళ్లీ ఏకాకులుగా మారారు. ప్రస్తుతం ఇద్దరు బాలీవుడ్ లో తోడు లేని బ్యాచిలర్స్. మరి మళ్లీ ఆ ఇద్దరు కలిసే అవకాశం ఏదైనా? ఉందా? అన్నది చూడాలి.