శ్రద్ధా బికినీ దెబ్బకు మూగవోయిన సెలయేరు
యోలో అంటూ సాగే పాటను తెలుగు వెర్షన్ పాడేందుకు డీఎస్పీ అవకాశం కల్పించాడని తెలిపింది
By: Tupaki Desk | 15 Nov 2024 3:18 PM GMTచాలా కాలంగా చడీ చప్పుడు లేకుండా సైలెంట్ గా ఉంది శ్రద్ధా దాస్. అప్పట్లో `గుంటూరు టాకీస్`లో మాఫియా రాణిగా ఫన్ రైడ్ ఉన్న రోల్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాల్లో కనిపించలేదు. అయితే తెలుగు బుల్లితెరపైనా కొన్నాళ్ల పాటు కనిపించింది. కానీ ఇటీవల ఎందుకనో సినిమాల్లో ఆశించిన ఛాన్సుల్లేవ్. మొన్నటికి మొన్న సూర్య `కంగువ` కోసం ఒక పాట పాడి ఆశ్చర్యపరిచింది. అసలు ఈ అవకాశం ఎవరిచ్చారు? ఎలా వచ్చింది? అంటూ ఆరాలు తీశారు కొందరు. తనను పిలిచి డిఎస్పీ అవకాశం కల్పించాడంటూ శ్రద్ధా మురిపెంగా చెప్పుకుంది. యోలో అంటూ సాగే పాటను తెలుగు వెర్షన్ పాడేందుకు డీఎస్పీ అవకాశం కల్పించాడని తెలిపింది. పాట యావరేజ్ గానే ఉన్నా శ్రద్ధా హస్కీ వాయిస్ ఆకట్టుకుంది.
శ్రద్ధా మునుముందు కూడా పాడతానని కూడా చెప్పింది. ``హైదరాబాద్లోని డిఎస్పి కచేరీలో నేను ఎందుకు ప్రదర్శన ఇచ్చానో అని అందరూ ఆశ్చర్యపోయారు. కొద్ది రోజుల తర్వాత `కంగువ`లో `యోలో` పాడింది నేనేనని ప్రజలు గ్రహించారు. నేను పాడటాన్ని ఇష్టపడ్డాను..సినిమాకు ఏదో ఒక విభాగంలో పని చేయడం చాలా ఇష్టం`` అని శ్రద్ధా చెప్పింది. శ్రద్ధతో పాటు డీఎస్పీ, సాగర్ కూడా ఈ పాట పాడారు. శివ దర్శకత్వం వహించిన కంగువ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున నిర్మించారు.
దశాబ్దం క్రితం తన కెరీర్ని ప్రారంభించిన శ్రద్ధా ఇప్పటికీ అవకాశాలొస్తున్నాయని కూడా తెలిపింది. భవిష్యత్తులో గాయనిగాను, మరిన్ని పాటలు పాడేందుకు ఇష్టపడతానని చెప్పింది. మరోవైపు శ్రద్ధా దాస్ వీలున్న ప్రతిసారీ వేడెక్కించే ఫోటోషూట్లతో మతులు చెడగొడుతోంది. తాజాగా శ్రద్ధా షేర్ చేసిన థీమ్ బేస్డ్ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా మారుతోంది. గలగల పారే సెలయేటి గట్టున సాలిడ్ రాక్ పై శ్రద్ధా మతి చెడే రీతిలో ఫోజులిచ్చింది. తనలోని గ్లామర్ యాంగిల్ ని ఎలివేట్ చేస్తూ బోల్డ్ అవతార్ ని ప్రెజెంట్ చేసింది. ముఖ్యంగా తన థై అందాలను దాచుకోకుండా బహిర్గతం చేసింది. బికినీ థై స్లిట్ దుస్తుల్లో అందాలు ఆరబోసింది. ఇది చూశాక.. సెలయేటి గట్టున గ్లామరస్ డాళ్ ఎవరో? అంటూ అభిమానులు దీనిపై కామెంట్లు చేస్తున్నారు.