Begin typing your search above and press return to search.

పెనంలో జొన్న రొట్టె మాడిపోతుందేమో జాగ్ర‌త్త శ్ర‌ద్దా!

ఖ‌రీదైన ఫ్రాకులో అంత స్టైలిష్ గా క‌నిపిస్తే పెనంలో రోటీ మాడిపోతుందేమో శ్ర‌ద్ధా గ‌మ‌నించాలి! అని అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 3:30 AM GMT
పెనంలో జొన్న రొట్టె మాడిపోతుందేమో జాగ్ర‌త్త శ్ర‌ద్దా!
X

బెంగాళీ బ్యూటీ శ్రద్ధా దాస్ తన కెరీర్ మొత్తంలో ఆరు విభిన్న చిత్ర పరిశ్రమలలో పనిచేసిన ప్రతిభావ‌ని. 2008లో సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో తెరంగేట్రం చేసింది. వెండితెరపైనా, తెర‌ వెలుపలా ఆకర్షణీయమైన ప్రదర్శనలతో అంకితమైన అభిమానులను సంపాదించుకుంది. తరచుగా తన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. శ్రద్ధాదాస్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో మరోసారి వైర‌ల్ గా దూసుకెళ్లింది.

తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస‌క్తిని రేకెత్తించే ఫోటోలను షేర్ చేసింది. వీటిలో శ్రద్ధా దాస్ షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ ఫ్రాకును ధ‌రించి క‌నిపించింది. అయితే శ్ర‌ద్ధా జొన్న‌ రోటీలు త‌యారు చేస్తూ బిజీగా ఉంది. క‌ట్టెల పొయ్యిపై జొన్న‌రొట్టెలు చేస్తున్న పెద్ద‌మ్మ‌కు స‌హ‌క‌రిస్తూ ఇదిగో ఇలా న‌వ్వులు చిందిస్తోంది. నిజ‌మే పెద్ద‌మ్మ‌కు పెద్ద సాయ‌మే చేస్తోంది. ఈ జొన్న రోటీలు లేదా రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. వేడిగా ఉన్న‌ప్పుడే తినాలి. జొన్న రొట్టెలకు హైద‌రాబాద్ స‌హా తెలంగాణ‌లో మంచి డిమాండ్ ఉంది. చాలా చోట్ల గ్రామాల్లోను జొన్న రొట్టెల‌ను అమ్ముతుంటారు.

ఇప్పుడు ఇదే కాన్సెప్టుతో శ్ర‌ద్ధా ఫోటోషూట్ వ‌ర్క‌వుటైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఖ‌రీదైన ఫ్రాకులో అంత స్టైలిష్ గా క‌నిపిస్తే పెనంలో రోటీ మాడిపోతుందేమో శ్ర‌ద్ధా గ‌మ‌నించాలి! అని అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

శ్రద్ధా దాస్ ఇటీవలే సంతోష్ కంభంపాటి ద‌ర్శకత్వం వహించిన 'పారిజాత పర్వం' చిత్రంలో కనిపించింది. ఈ చిత్రంలో శ్రద్ధాదాస్ , చైతన్య రావు ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్య సీక్వెల్‌లో అతిథిగా న‌టించిన తర్వాత శ్ర‌ద్ధా దాస్ టాలీవుడ్ లో ప‌లువురు యువ‌హీరోల సినిమాల్లోను న‌టించింది. కానీ ఆశించిన బిగ్ బ్రేక్ రాలేదు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో గుంటూరు కారంలో ఆక‌ట్టుకునే పాత్ర‌లో న‌టించింది. 2010లో సంజయ్ పురాణ్ సింగ్ దర్శకత్వం వహించిన లాహోర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. డ్రాక్యులా 2012 చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో ను అడుగుపెట్టింది.