Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : శ్రద్ద మిర్రర్‌ సెల్ఫీ సూపర్‌

ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసిన సెల్ఫీ లు వైరల్‌ అవుతున్నాయి. మిర్రర్‌ సెల్ఫీలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, బాగుంటాయి అంటూ తన ఇన్‌స్టా లో షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   16 July 2024 3:15 AM GMT
పిక్ టాక్ : శ్రద్ద మిర్రర్‌ సెల్ఫీ సూపర్‌
X

2008 సంవత్సరంలో సిద్దు ఫ్రమ్‌ సికాకులం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్‌ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఈ అమ్మడు సాగించిన జర్నీ ఎంతో మందికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు.

ఆఫర్లు రావడం లేదని, వచ్చిన ఆఫర్లు సక్సెస్ అవ్వలేదని చింతించకుండా శ్రద్ధ దాస్‌ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా మలయాళం, హిందీ, బెంగాలీ మరియు కన్నడ సినిమాల్లో నటించిన ఈ అమ్మడు వెబ్ సిరీస్ లు కూడా చేయడం ద్వారా మరింత గుర్తింపు దక్కించుకుంది.

స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశం రాని హీరోయిన్స్‌ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కష్టం. అయితే ఆ విషయంలో శ్రద్ధా దాస్‌ కి మినహాయింపు ఇవ్వొచ్చు. ఎంపిక చేసుకునే పాత్రలు మరియు ప్రత్యేక పాటల వల్ల ఇన్నాళ్లు అయినా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.

ముఖ్యంగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే అందాల ఆరబోత ఫోటోలు మరియు వీడియో లు రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసిన సెల్ఫీ లు వైరల్‌ అవుతున్నాయి. మిర్రర్‌ సెల్ఫీలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి, బాగుంటాయి అంటూ తన ఇన్‌స్టా లో షేర్‌ చేసింది.

విభిన్న రకాల మిర్రర్ సెల్ఫీలను షేర్‌ చేయడం ద్వారా మరోసారి తన అందాల ఆరబోతతో కుర్రకారును ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అయినా ఇండస్ట్రీ లో మాత్రం రావాల్సినంత గుర్తింపు, స్టార్‌ డమ్‌ రాలేదు అనేది ఫ్యాన్స్‌ మాట.