Begin typing your search above and press return to search.

రష్మికను పట్టించుకోని బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

అయితే, శ్రద్ధా రావడానికి గమనించిన రష్మిక, ఆమెను పలకరించడానికి అక్కడ ఆగింది. అయితే, రష్మికను ఏ మాత్రం పట్టించుకోకుండా, శ్రద్ధా కపూర్ పక్క నుంచి వెళ్లిపోయింది.

By:  Tupaki Desk   |   20 Sep 2023 11:38 AM GMT
రష్మికను పట్టించుకోని బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!
X

దక్షిణాది స్టార్ హీరోయిన్ లలో రష్మిక ఒకరు. తెలుగుతో పాటు, దక్షిణాదిన అన్ని భాషల్లో అవకాశాలు అందుకొని, స్టార్ హీరోయిన్ హోదాని అందుకుంది. ఈ సినిమాలతో ఆమె నేషనల్ క్రష్ గా గుర్తింపు కూడా పొందింది. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లోనూ వరసగా ఆమె అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఆమె నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

రణ్వీర్ సింగ్ తో కలిసి ఆమె నటించిన యానిమల్ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుంది. విడుదలకు రెడీగా ఉంటుంది. ఆమె చేతిలో మరో రెండు, మూడు సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి రష్మికకు అవమానం ఎదురైంది. రీసెంట్ గా, వినాయక చవితి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులందరికీ అంబానీ కుటుంబం ఆహ్వానం పంపింది. అలా ఆహ్వానం అందుకున్న వారిలో రష్మిక కూడా ఉంది.

రష్మికతో పాటు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా వచ్చింది. ఈ ఈవెంట్ కి రష్మిక చక్కగా చీరలో మెరిసింది. ఇక, శ్రద్ధా కపూర్ సైతం తెలుగు రంగు చూడీదార్ లో తలకు మల్లెపూలు పెట్టుకొని వచ్చింది. అయితే, శ్రద్ధా రావడానికి గమనించిన రష్మిక, ఆమెను పలకరించడానికి అక్కడ ఆగింది. అయితే, రష్మికను ఏ మాత్రం పట్టించుకోకుండా, శ్రద్ధా కపూర్ పక్క నుంచి వెళ్లిపోయింది.

అది చూసి మొదట రష్మిక షాకైంది. కానీ, చుట్టూ ఉన్న కెమేరాలు వారినే ఫోకస్ చేస్తున్నాయి అనే విషయాన్ని గమనించిన ఆమె, వెంటనే తేరుకొని, ఫోటోలకు నవ్వుతూ ఫోజులు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. శ్రద్ధా నిజంగానే ఆమెను గమనించలేదని, అందుకే, ఇలా జరిగిందని కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

కొందరు మాత్రం శ్రద్ధా చేసిన పనికి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రష్మిక దక్షిణాది తార అనే కారణంతోనే ఇలా ప్రవర్తించారు అంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు. బాలీవుడ్ లో నెపొటిజం చాలా ఎక్కువ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు.