Begin typing your search above and press return to search.

ప్రభాస్ టిఫిన్ బాక్స్ కోసం ఆమె ఎదురు చూపు...!

ప్రభాస్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఆయన ఇంటి భోజనం రుచి చూసి ఉంటారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 9:53 AM GMT
ప్రభాస్ టిఫిన్ బాక్స్ కోసం ఆమె ఎదురు చూపు...!
X

ప్రభాస్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఆయన ఇంటి భోజనం రుచి చూసి ఉంటారు. మళ్లీ మళ్లీ ప్రభాస్ ఇంటి భోజనం తినాలి అని కోరుకునే వారు చాలా మంది ఉంటారు. ప్రభాస్‌ ఇంటి భోజనం అంటే మామూలుగా ఉండదు అని, తినిపించి చంపేస్తారు అని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంది.


ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్ కూడా ప్రభాస్ ఇంటి భోజనం ఆస్వాదించిన వారిలో ఉన్నారు. సాహో బ్యూటీ శ్రద్దా కపూర్‌ గతంలో పలు సార్లు కూడా సోషల్‌ మీడియా ద్వారా ప్రభాస్ ఇంటి భోజనం గురించి మాట్లాడింది. ఇప్పుడు మరోసారి ప్రభాస్‌ టిఫిన్ గురించి కామెంట్‌ చేసింది.

సోషల్‌ మీడియాలో శ్రద్దా కపూర్‌ ను ఒక నెటిజన్ మీరు మళ్లీ ప్రభాస్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అంటూ ప్రశ్నించాడు. అతడి ప్రశ్నకు ఫన్నీగా సమాధానం ఇచ్చింది. మళ్లీ ఎప్పుడు అయితే ప్రభాస్ గారు నాకు ఫుడ్‌ టిఫిన్ ని పంపిస్తాడో అప్పుడు చేస్తాను అన్నట్లుగా సమాధానం చెప్పింది.

తూ ఝూతి మైన్ మక్కర్‌ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రద్దా కపూర్‌ అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఇలా ఫ్యాన్స్ తో చిట్‌ చాట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈ నెల చివర్లో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో వైపు సలార్‌ 2 మరియు రాజా సాబ్‌ సినిమాల షూటింగ్‌ సాగుతోంది. మరి శ్రద్ద కోరుకున్నట్లుగా ప్రభాస్‌ ఎప్పుడు ఆమెకు ఫుడ్‌ టిఫిన్ పంపిస్తాడో చూడాలి.