Begin typing your search above and press return to search.

అప్పటికింకా 16 వ‌య‌సు.. స్టార్ హీరోకి నో చెప్పింది!

శ్ర‌ద్ధా త‌దుప‌రి క్రిష్ 4 లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2024 4:08 AM GMT
అప్పటికింకా 16 వ‌య‌సు.. స్టార్ హీరోకి నో చెప్పింది!
X

హారర్ కామెడీ 'స్ట్రీ 2' విజయం సాధించ‌డంతో శ్రద్ధా కపూర్ ఫుల్ జోష్‌లో క‌నిపిస్తోంది. శ్ర‌ద్ధా త‌దుప‌రి క్రిష్ 4 లాంటి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో న‌టించ‌నుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. 2010లో 'తీన్ పట్టి'తో తెరంగేట్రం చేసి, ఆషికి 2తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న శ్ర‌ద్ధా కెరీర్ అటుపై వెను దిరిగి చూసుకున్న‌దే లేదు. ప్ర‌భాస్ స‌ర‌స‌న సాహో లాంటి భారీ పాన్ ఇండియ‌న్ చిత్రంలో న‌టించింది. ఇటీవ‌లే విడుదలైన స్త్రీ2తో గ్రాండ్ స‌క్సెస్ అందుకుంది. ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన హారర్-కామెడీ చిత్రంగా రికార్డుల్లో నిలిచింది. బ్లాక్ బ‌స్ట‌ర్ స్త్రీ చిత్రానికి ఇది సీక్వెల్.

స్త్రీ 2 విజ‌యోత్స‌వం సంద‌ర్భంగా ఇంట‌ర్వ్యూలో శ్ర‌ద్ధా చెప్పిన ఓ సంగ‌తి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. శ్ర‌ద్ధాకు తొలి అవ‌కాశ‌మే సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ స‌ర‌స‌న వెతుక్కుంటూ వ‌చ్చింది. కానీ దానిని సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. శ్రద్ధా అధికారికంగా 2010లో తీన్ పట్టితో ఆరంగేట్రం చేయగా, త‌న‌కు మొదట సినిమా ఆఫర్ వచ్చింది స‌ల్మాన్ నుంచి. సల్మాన్ ఖాన్ సరసన కేవలం 16 ఏళ్ల యువ‌తిగా ఉన్న త‌న‌కు అవ‌కాశం వ‌చ్చింది. 2005 లో విడుద‌లైన 'లక్కీ: నో టైమ్ ఫర్ లవ్' కోసం శ్ర‌ద్ధాను సంప్రదించినట్లు వెల్లడించింది. చివరికి ఆ పాత్ర‌ను స్నేహా ఉల్లాల్ పోషించింది.

నిజానికి శ్ర‌ద్ధా ఎప్పుడూ నటి కావాలని కోరుకుంది. కానీ ఎందుక‌నో శ్రద్ధా స‌ల్మాన్ తో ఆఫర్‌ను స్వీకరించకూడదని నిర్ణయించుకుంది. అప్ప‌టికి తన చదువును పూర్తి చేయడంపై దృష్టి పెట్టిందిట‌. అప్ప‌టికి 15 లేదా 16 సంవత్సరాల వయస్సులో ఉన్నాను. చాలా చిన్నవ‌య‌సు. పాఠశాల విద్యను పూర్తి చేసి కాలేజీకి వెళ్లాలని అనుకున్నాను. అప్పట్లో ఆఫర్లు రావడం నా విజయానికి డెఫినిష‌న్ అని నేను అనుకోను. కానీ ఆ స‌మ‌యంలో దానిని వెంట‌నే తిరస్కరించడం .. చదువుపై దృష్టి పెట్టడం కష్టమే. ఎందుకంటే సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేయడం చాలా అద్భుతమైన అవ‌కాశం క‌దా! అని శ్ర‌ద్ధా అంది.

ఆషికి 2తో కెరీర్ ఒక్క‌సారిగా మ‌లుపు తిరిగిన రోజుల‌ను కూడా గుర్తు చేసుకుంది. పెద్ద మలుపును చూడటానికి శ్రద్ధాకు కేవలం రెండు సినిమాలే స‌రిపోయాయి. రెండో ప్ర‌య‌త్న‌మే 'ఆషిఖి 2' తో ఓవ‌ర్ నైట్ సంచలనంగా మారింది. అటుపై ఛిచోరే, సాహో, స్త్రీ, ABCD 2, ఏక్ విలన్, బాఘీ 3, స్ట్రీట్ డ్యాన్సర్ 3D వంటి విజయవంతమైన చిత్రాలలో నటించింది. స్త్రీ 2 విడుద‌లైన‌ కొద్ది రోజుల్లోనే రూ. 100 కోట్లు దాటింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా త‌దిత‌రులు నటించారు.