Begin typing your search above and press return to search.

అది ఆడ దెయ్యం కాదు మ‌గ దెయ్య‌మా?

ఈ సినిమాకి సీక్వెల్ గా `స్త్రీ-2`ని కూడా తెర‌కెక్కిస్తున్న‌ట్లు సంగ‌తి తెలిసిందే. య‌ధావిధిగా శ్ర‌ద్దా ప్ర‌ధాన పాత్ర‌లో కొన‌సాగుతుంది.

By:  Tupaki Desk   |   19 July 2024 12:30 PM GMT
అది ఆడ దెయ్యం కాదు మ‌గ దెయ్య‌మా?
X

బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధా క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌లో అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్త్రీ`అప్ప‌ట్లో ఎలాంటి విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. కామెడీ హార‌ర్ లో శ్ర‌ద్దా కపూర్ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకుంది. న‌టిగా శ్ర‌ద్దా క‌పూర్ ని మ‌రో మెట్టు పైకెక్కించిన చిత్ర‌మ‌ది. క‌మ‌ర్శియ‌ల్ గా సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. 18 కోట్ల‌తో నిర్మించిన చిత్రం 180 కోట్ల‌కు పైగా వ‌సూళ్లను సాధించింది.

ఈ సినిమాకి సీక్వెల్ గా `స్త్రీ-2`ని కూడా తెర‌కెక్కిస్తున్న‌ట్లు సంగ‌తి తెలిసిందే. య‌ధావిధిగా శ్ర‌ద్దా ప్ర‌ధాన పాత్ర‌లో కొన‌సాగుతుంది. ఆమెకి జోడీగా రాజ్ కుమార్ రావు న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి మంచి బిజ్ ని తీసుకొచ్చాయి. ఇందులో దెయ్యంతో రొమాంటిక్ సినిమాలు ఇంట్రెస్టింగ్. తొలి రోజే హీటెక్కించే స‌న్నివేశంతో షూటింగ్ మొద‌లు పెట్టారు. బెడ్ రూమ్ స‌న్నివేశాలు హైలైట్ అనే ప్ర‌చారం సాగుతోంది.

అప్ప‌టి నుంచి `స్త్రీ -2` బోల్డ్ అటెంప్ట్ గా హైలైట్ అవుతోంది. ఇక దెయ్యం పాత్ర ఎవ‌రు పోషిస్తున్నార‌న్న‌ది ఓపెన్ సీక్రెట్. దెయ్యం పాత్ర‌లో శ్ర‌ద్దాక‌పూర్ న‌టిస్తోంది. కాగా ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా శ్ర‌ద్దా ముందుకు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? అనే ప్ర‌శ్న వెళ్లింది. దీనికి స‌మాధానంగా న‌చ్చిన స్త్రీ క‌నిపించిన‌ప్పుడు త‌ప్ప‌కుండా పెళ్లి చేసుకుంటా? అని చెప్పు కొచ్చింది శ్ర‌ద్దాక‌పూర్.

దీంతో సినిమాలో పైకి క‌నిపించ‌డానికి శ్ర‌ద్దా క‌పూర్ లేడీ దెయ్యం అయినా? కానీ ఆమె ఆత్మ మాత్రం మేల్ దా? అంటూ సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. అమ్మ‌డి ముందుకెళ్లింది వ్య‌క్తిగ‌త ప్ర‌శ్న అయినా సినిమాకి సంబంధించిన హింట్ ఇచ్చిన‌ట్లు అయింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన ట్రైల‌ర్ మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అన్ని ప‌న‌లు పూర్తి చేసుకుని స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్టు 15న చిత్రం రిలీజ్ అవుతుంది.