అతడిపై శ్రద్దా శ్రీనాధ్ ప్రేమ 18 ఏళ్ల వయసులోనే!
ఇన్నాళ్లు అమ్మడు దాన్ని దాచేసినా ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయక తప్పలేదు
By: Tupaki Desk | 2 Jan 2024 9:14 AM GMTహీరోయిన్ల ఒంటిపై టాటూల గురించి చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది భామలు పర్మినెంట్ టాటూ వెయించుకుంటే మరికొంత మంది తాత్కాలికమైన టాటూలు వేయించుకుంటారు. టాటూ లేని హీరోయిన్ అంటూ ఎవరూ లేరు. తమకిష్టమైన వారి పేర్లు...సింబల్స్ ని పచ్చబొట్టుగా పొడిపించుకుని తమ ప్రేమని చాటి చెబుతుంటారు. తాజాగా హాట్ బ్యూటీ శ్రద్దా శ్రీనాధ్ ఎదపై ఉన్న టాటూ కూడా బట్టబయలైంది.
ఇన్నాళ్లు అమ్మడు దాన్ని దాచేసినా ఇప్పుడు మాత్రం ఓపెన్ చేయక తప్పలేదు. అమ్మడు ధరించిన ఔట్ ఫిట్ తోనే అది బహిర్గతమవుతోంది. ఇంతకీ ఆ టాటూ వెనుక ఉన్న చరిత్ర ఏంటి? దాని ప్రత్యేకత ఏంటి? ఎదపైనే అంత బాధని భరించి పర్మినెంట్ టాటూ వేయించుకోవడం వెనుక ఆసక్తి ఏంటి? అంటే చాలా కమామీషు ఉన్నట్లు చెప్పొచ్చుకొచ్చింది. 'ఆ టాటూ వెనుక ది బీటిల్స్ అనే ఓ బ్యాండ్ ఉంది.
అది ఆ బ్యాండ్ ఆల్బమ్ కవర్. ఇది ప్రేమను సూచిస్తుంది. నాకు 18 ఏళ్ళ వయసులో ఒక అబ్బాయిపై చాలా ప్రేమ ఉంది. ది బీటిల్స్ కు పరిచయం చేసింది అతనే. కాబట్టి ఆ క్షణాన్ని గుర్తుచేసుకోవడానికి నేను ఈ టాటూను వేయించుకున్నాను. ఇది పచ్చబొట్టు శాశ్వతమైనది. ఇది చెరగనది. ఎంత ట్రై చేసినా పోని టాటూ ఇది. నా లైప్ లాంగ్ గుర్తు ఉండాలనే ఆ టాటూ వేయించాను' అని చెప్పుకొచ్చింది.
మొత్తాని శ్రద్దా శ్రీనాధ్ టాటూ వెనుక చాలా పెద్ద కథే ఉందని తెలుస్తోంది. 18 ఏళ్ల వయసులో వేయించు కున్న టూటూ ఇప్పటికీ అలాగే ఎక్కడా చెక్కు చెరదలేదు. అతగాడిపై ఎంత ప్రేమ ఉంటే? ఇలా శాశ్వత పచ్చబోట్టు వేయించుకుంటుంది. అతడిని ఆమె ఎంతగా అభిమానిస్తుందన్న దానికి ఈ టాటూని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు.