Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: రివీలింగ్ బ్లౌజ్‌లో శ్ర‌ద్ధా సొగ‌సు

మ‌రోవైపు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ సోష‌ల్ మీడియాలో జ‌రంత స్పీడ్ గా ఉంది. తాజా ఫోటోషూట్ లో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో శ్ర‌ద్ధ ఎంతో అందంగా క‌నిపించింది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 5:00 AM GMT
ఫోటో స్టోరి: రివీలింగ్ బ్లౌజ్‌లో శ్ర‌ద్ధా సొగ‌సు
X

సౌత్‌లో కెరీర్ జ‌ర్నీ సాగిస్తున్న ప్ర‌తిభావంతుల్లో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. శ్రద్ధా 2015లో మలయాళ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. తమిళం, కన్నడ, తెలుగు, హిందీ చిత్రాలలో నటించింది. ప్రస్తుతం శ్రద్ధా కెరీర్ ఆశించిన విధంగా సాగ‌డం లేదు.

ఇటీవలే విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ్' సినిమాలో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ ఆశించిన విజ‌యాన్ని అందుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. సైంధవ్ బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వ‌డం త‌న‌కు మైన‌స్ అయింది. అయితే ఈ చిత్రంలో శ్ర‌ద్ధ న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ బ్యూటీ కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.

మ‌రోవైపు శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ సోష‌ల్ మీడియాలో జ‌రంత స్పీడ్ గా ఉంది. తాజా ఫోటోషూట్ లో స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో శ్ర‌ద్ధ ఎంతో అందంగా క‌నిపించింది. ఇది క్రిస్ట‌ల్స్ అల్లిక‌తో రూపొందించిన డిజైన‌ర్ బ్లౌజ్. దానికి కాంబినేష‌న్ గా చీర కూడా అంతే ఇదిగా క‌నిపిస్తోంది. ఇక రివీలింగ్ బ్లౌజ్ లో శ్ర‌ద్ధా అంద‌చందాలు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారాయి.

శ్ర‌ద్ధా ప్ర‌స్థానం ప‌రిశీలిస్తే..లా స్కూల్ నుండి పట్టా పొందిన తరువాత శ్రద్ధ బెంగళూరులోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి న్యాయవాదిగా పనిచేసారు. అలాగే ఫ్రెంచ్ రిటైల్ కంపెనీకి న్యాయ సలహాదారుగా కూడా పనిచేసింది. అయితే నటన పట్ల తనకున్న అభిరుచిని కొనసాగించడానికి శ్రద్ధా తన ఖాళీ సమయంలో నటవృత్తిని చేప‌ట్టింది. మలయాళ పరిశ్రమ నుండి పేరొచ్చాక‌.. అక్క‌డ‌ అనేక ప్రకటనలలో కనిపించింది.

న్యాయవాది అయిన శ్రద్ధా శ్రీనాథకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. వైవిధ్య‌మైన‌ ప్రాంతాలకు వెళ్లడానికి విభిన్న సంస్కృతులను ప‌రిశీలించడానికి ఇష్టపడుతుంది. ఇప్పటి వరకు శ్రద్ధా లండన్, దక్షిణ కొరియా, హిమాలయాలు, స్విట్జర్లాండ్‌లను సందర్శించింది.

శ్రద్ధా ప‌లు తమిళ, కన్నడ చిత్రాలలో న‌టించి పేరు సంపాదించింది. అయితే పెద్ద స్క్రీన్‌లో తొలిసారిగా ఇంద్రజిత్ సుకుమారన్ -ఆసిఫ్ అలీలతో కలిసి మలయాళం చిత్రం కోహినూర్ లో న‌టించింది. శ్రద్ధా మొదటి మలయాళ చిత్రం విడుదలైన వెంటనే పవన్ కుమార్ దర్శకత్వం వహించిన తన మొదటి కన్నడ చిత్రం 'యు-టర్న్'లో క‌థానాయిక‌గా న‌టించింది. ఆ తరువాత ‘ఉర్వి’లో నటించింది. తమిళ చిత్రం ‘కాట్రు వెలియిదై’లో అతిధి పాత్ర పోషించింది. ఆమె తమిళంలో ‘ఇవన్ తంతిరన్’తో, హిందీలో ‘మిలన్ టాకీస్’తో, తెలుగులో ‘జెర్సీ’తో అరంగేట్రం చేసింది. విక్రమ్ వేద-యు-టర్న్-ఆపరేషన్ అలమేలమ్మ వంటి చిత్రాలలో అద్భుత‌ నటనతో ఆక‌ట్టుకుంది.