నల్లకోటు పక్కనబెట్టి మోడ్రన్ దుస్తుల్లో లాయరమ్మ!
కొన్నాళ్ల పాటు ప్రాక్టీస్ అనంతరం నల్లకోటును పక్కనబెట్టి మోడ్రన్ దుస్తుల్లో మెరవడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఆ దుస్తుల్లోనే అభిమానుల్ని అలరిస్తుంది.
By: Tupaki Desk | 10 Dec 2023 8:30 AM GMTడాక్టర్ కాబోయ్ యాక్టర్లు అయినా వాళ్లెంతో మంది. కానీ లాయర్ కాబోయి యాక్టర్ అయిన నటి మాత్రం ఈవిడే. అవును ఈ అమ్మడు నటికంటే ముందు లాయర్ పట్టా సంపాదించింది. కొన్నాళ్ల పాటు ప్రాక్టీస్ అనంతరం నల్లకోటును పక్కనబెట్టి మోడ్రన్ దుస్తుల్లో మెరవడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఆ దుస్తుల్లోనే అభిమానుల్ని అలరిస్తుంది. ఇంతకీ ఎవరాభామ? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
'జెర్సీ'తో టాలీవుడ్ కి పరిచయమైన శ్రద్ధా శ్రీనాద్ సుపరిచితమే. అమ్మడికి తొలి సినిమాలోనే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తాజాగా ఈ బ్యూటీ గురించి మరిన్ని విశేషాలు...ఆమె మాటల్లోనే.. 'మాది మైసూర్..అమ్మ టీచర..నాన్న ఆర్మీ ఉద్యోగి. నాన్న జాబ్ రీత్యా దేశంలో చాలా రాష్ట్రాలు తిరిగాం. ఏడవ తరగతి నుంచి పదవతరగతి వరకూ సికింద్రా బాద్ లోనే చదువుకున్నా.
ఇంటర్మీడియట్ సమయానికి బెంగుళూరు వెళ్లిపోయాను. అక్కడ బెంగుళూరు ఇనిస్ట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో ఎల్ ఎల్ బీ చదివా. తర్వాత కొన్నాళ్ల పాటు కార్పోరేట్ లాయర్ గా పనిచేసాను. ఎల్ ఎల్ బీ చదువుతున్న సమయంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో..నాటకాల్లో పాల్గొనే దాన్ని. చాలా మంది మెచ్చుకోవడంతో నా నటనపై నమ్మకం ఎక్కువైంది. ఆ తర్వాత థియేటర్ గ్రూప్ లో చేరి నాటకాలు వేసేదాన్ని.
అప్పుడే యాడ్స్ చేసే అవకాశం కూడా వచ్చింది. అటుపై సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాను. 'కోహినూర్' అనే మలయాళం సినిమాలో నటించే అవకాశం వచ్చింది. చిన్న నాటి నుంచి ఇంట్లో స్వేచ్చ ఇచ్చారు. సండే వస్తే అక్క.. నేను సినిమాకి వెళ్లేవాళ్లం. ఆ తర్వాత నా స్టోరీలకు నా స్నేహితులు బలైపో యేవారు. పదో తరగతిలో ఉన్నప్పుడు సినిమాల్లోకి వెళ్లొచ్చుగా అని చెప్పేవారు. బహుశా వాళ్లంతా అలా ప్రోత్సహించడం వల్లే ఇంతవరకూ రాగలిగానేమో' అనిపిస్తుంది అన్నారు. ప్రస్తుతం ఈ భామ నటిస్తోన్న 'సైంధవ్' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అలాగే అమ్మడి చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ లు ఉన్నాయి.