Begin typing your search above and press return to search.

మెకానిక్ రాకీ కోసం స్టైలిష్ పాప

యువ హీరో విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రం 'మెకానిక్ రాకీ'తో దీపావళి రేసులో ఉన్నాడు

By:  Tupaki Desk   |   21 July 2024 7:23 AM GMT
మెకానిక్ రాకీ కోసం స్టైలిష్ పాప
X

యువ హీరో విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రం 'మెకానిక్ రాకీ'తో దీపావళి రేసులో ఉన్నాడు. ఈ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత రామ్ తల్లూరి SRT ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే విశ్వక్ సేన్ డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ అందుకుంటూ ఉన్నాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాపై కూడా ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక ట్రయాంగిల్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక శ్రద్ధా శ్రీనాథ్ కు వెల్కమ్ చెప్పే మూమెంట్ మరింత ప్రత్యేకంగా మార్చడంలో భాగంగా, మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో ఆమె స్లిట్ మాక్సీ డ్రెస్‌లో అందంగా కనిపిస్తున్నారు. ఆమె ముఖం మీద చిరునవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'మెకానిక్ రాకీ' సినిమా భారీ బడ్జెట్‌తో, పెద్ద కాన్వాస్‌పై నిర్మించబడింది. ఈ చిత్రంలో ప్రతిష్టాత్మక టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతం సమకూర్చగా, మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

అన్వర్ అలీ ఎడిటర్‌గా, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సత్యం రాజేష్ మరియు విద్యా సాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ మెకానిక్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. శ్రద్ధా శ్రీనాథ్ మరియు మీనాక్షి చౌదరి మధ్య ఉండే కెమిస్ట్రీ, సినిమా కథకు మరింత ఉత్కంఠతను కలిగిస్తుందని మేకర్స్ తెలియజేశారు.

ఈ కథలో కమెడీ, యాక్షన్ సరికొత్తగా ఉంటాయని దీంతో ప్రేక్షకులను పూర్తిగా ఎంటర్‌టైన్ అవుతారని అని తెలిపారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇప్పటికే తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఈ చిత్రంలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, మరియు శ్రద్ధా శ్రీనాథ్ మధ్య కెమిస్ట్రీ సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించేలా ఉండనుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులలో మంచి అంచనాలను సృష్టించింది. దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు సిద్ధంగా ఉంది. సినిమాటోగ్రఫీ, సంగీతం, మరియు ఇతర సాంకేతిక విభాగాలు సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయని అర్ధమవుతుంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం, 'మెకానిక్ రాకీ' సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ దీపావళి సీజన్‌లో ప్రేక్షకులకు మోస్ట్ అవైటెడ్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని భావిస్తున్నారు.