Begin typing your search above and press return to search.

శ్రేయ.. ఒక్కసారిగా భయపెట్టేసిందిగా!

కళాశాలలో ఏ గ్యాంగ్ లో చేరని నాగచైతన్యకు తమదే బెస్ట్ గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 3:30 AM GMT
శ్రేయ.. ఒక్కసారిగా భయపెట్టేసిందిగా!
X

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య డెబ్యూ మూవీ జోష్ తో అలనాటి స్టార్ హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాతో హైదరాబాద్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి కూడా సినిమాల్లోకి అడుగు పెట్టింది. చిత్రంలో కాలేజీలో చైతూకు భావన అనే ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించి అలరించింది. కళాశాలలో ఏ గ్యాంగ్ లో చేరని నాగచైతన్యకు తమదే బెస్ట్ గ్యాంగ్ అని చెబుతూ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది.


అయితే తెలుగులో జోష్ మూవీ తర్వాత సందీప్ కిషన్ స్నేహ గీతం మూవీలో యాక్ట్ చేసింది శ్రేయ. తన అందం, అభినయంతో మెప్పించింది. అదే సమయంలో పలు టీవీ యాడ్స్ లో కూడా తళుక్కుమంది అమ్మడు. కానీ టాలీవుడ్ లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అప్పుడే బాలీవుడ్ లో మెల్లగా అవకాశాలు రావడంతో చెక్కేసింది. అక్కడ లేడీస్ రూమ్ యూట్యూబ్ సిరీస్‌ తో ఫుల్ పాపులర్ అయింది.


ఆ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీసుల్లో అవకాశాలు అందుకుంది బ్యూటీ. దుల్కర్ సల్మాన్ చుప్ తో శ్రేయా ధన్వంతరి మంచి పేరు సంపాదించుకుంది. గన్స్ అండ్ గులాబ్స్, స్కామ్ 1992, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీసుల్లో ఛాన్సులు అందుకుంది. మంచి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. వేరే లెవెల్ పాపులారిటీ దక్కించుకుంది. టాలీవుడ్ బ్యూటీ.. బాలీవుడ్ లో అలా ఫుల్ బిజీ బిజీగా ప్రాజెక్టులతో గడుపుతోంది.


ఇప్పుడు హిందీ సినిమాలు అద్భుత్, నౌషికియేలో శ్రేయా ధన్వంతరి నటిస్తోంది. అందులో అద్భుత్ మూవీ మరో రెండు రోజుల్లో విడుదల కానుంది. థియేటర్స్, ఓటీటీల్లో రిలీజ్ చేయకుండా నేరుగా టీవీల్లోకి రానుంది. హారర్ థ్రిల్లర్ జోనర్‌ లో తెరకెక్కిన అద్భుత్ సోనీ మ్యాక్స్ లో ప్రీమియర్ కానుంది. ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన అద్భుత్ ట్రైలర్ ఆకట్టుకుంది.

అయితే తాజాగా సినిమాలోని తన రోల్ మేకప్ కు సంబంధించిన పిక్స్ ను శ్రేయ షేర్ చేసింది. దెయ్యం మేకప్ తో సడెన్ గా భయపెట్టేసింది! మూవీలో ఆమె దెయ్యంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అద్భుత్ మూవీ.. సెప్టెంబర్ 15వ తేదీన ప్రీమియర్ కానుందని గుర్తు చేసింది. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో.. శ్రేయా ధన్వంతరి ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.