బికినీ బీచ్లో తెలుగమ్మాయి దుమారపర్వం
తాజాగా బికినీ బీచ్ లో వేడెక్కించే స్టింట్ తో కట్టి పడేసింది శ్రేయా. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక బీచ్ లో ఇలా ఫ్లోరల్ బికినీలో చెలరేగిపోయింది.
By: Tupaki Desk | 5 Jan 2024 1:14 PM GMTబికినీలో అందాలు ఆరబోయడం ఒకప్పుడు హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లకే సాధ్యం అనుకునే పరిస్థితి ఉండేది. బికినీ-స్విమ్ సూట్ లాంటి రివీలింగ్ దుస్తులు ధరించాలంటేనే నటీమణులు అపచారంగా భావించిన రోజులు తెలుగు చిత్రసీమలో ఉన్నాయి. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. తెలుగమ్మాయిలు మోడ్రన్ ఔట్ ఫిట్లలో కనిపించడం, బికినీలు స్విమ్ సూట్లలో చెలరేగడం రెగ్యులర్ గా చూస్తున్నాం.
ఇటీవల తెలుగు కథానాయికలు, సహాయ నటీమణులు బికినీలు, స్విమ్ సూట్లకు అభ్యంతరం చెప్పడం లేదు. అందాల్ని ఎంతగా రివీల్ చేస్తే అంతగా అవకాశాలు వెంటపడే ఈ ట్రెండ్ లో ఆరబోతకు ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. తెలుగు బుల్లితెరకు కొన్ని హద్దులు పాటిస్తున్నా కానీ, పెద్ద తెర నటీమణులు మాత్రం ఇంకా దాపరికాన్ని ఇష్టపడడం లేదు.
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న తెలుగమ్మాయి 'స్నేహగీతం' అమ్మాయేనా? అని సందేహించేంతగా మారిపోయింది. బికినీలు, స్విమ్ సూట్లతో దుమ్ము దులిపేస్తోంది. ప్రస్తుతం ముంబై పరిశ్రమలో ఎక్కువగా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ పేరు శ్రేయా ధన్వంతరి. కెరీర్ ఆరంభం మధురా శ్రీధర్ దర్శకత్వం వహించిన స్నేహగీతంలో నలుగురమ్మాయిల్లో ఒకరిగా నటించింది. అప్పటికి పంజాబీ చుడీదార్ లలో ఎంతో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ కాలంతో పాటే మార్పును ఆహ్వానించింది. ఇప్పటి ట్రెండ్ కనుగుణంగా రివీలింగ్ ఔట్ ఫిట్ లతో దుమారం రేపుతోంది.
బీచ్ లో ఒంపుసొంపుల రూపలావణ్యాన్ని ఆవిష్కరించేందుకు ఎంత మాత్రం వెనకాడడం లేదు. తాజాగా బికినీ బీచ్ లో వేడెక్కించే స్టింట్ తో కట్టి పడేసింది శ్రేయా. పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక బీచ్ లో ఇలా ఫ్లోరల్ బికినీలో చెలరేగిపోయింది. తనతో పాటే తన స్నేహితురాలు బీచ్ వేడుకల్ని ఆస్వాధించింది. రోటెనెస్ట్ 'ఐల్యాండ్ అండ్ బీచెస్' గురించి డీటెయిలింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వాట్సాప్ లలో దుమారం రేపుతున్నాయి. శ్రేయా బికినీలో ఎంతో స్పెషల్ గా ఉందంటూ యువతరం కామెంట్ చేస్తున్నారు.
శ్రేయా ఇటీవల హిందీ వెబ్ సిరీస్ లలో నటించి సత్తా చాటింది. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ తర్వాతా రాజ్ అండ్ డీకే అసోసియేషన్ లో పలు ప్రాజెక్టుల్లో ఈ బ్యూటీ కనిపిస్తోంది. ఇంకా హిందీలో మంచి అవకాశాల్ని అందుకుంటోంది. మునుముందు తెలుగు దర్శకులు అవకాశాలు కల్పిస్తే నటించేందుకు తనకు అభ్యతరం లేదని ఫీలర్స్ వదులుతోంది. మొత్తానికి ముంబై, బెంగళూరు, కోల్ కతా మెట్రో నగరాల ఫ్యాషనిస్టాలకు ధీటుగా ఇప్పుడు తెలుగమ్మాయిలు కూడా సవాల్ విసురుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.