షర్ట్ బటన్ తీసేసి.. ఓర చూపులతో తెలుగమ్మాయి
ప్రింటెడ్ షర్ట్ ధరించి ఉన్న ఫోటోలను పంచుకుంది. షర్ట్ బటన్ తీసేసి ఉండటంతో, ఆమె ఎద అందాలు హైలెట్ అయ్యాయి.
By: Tupaki Desk | 11 Sep 2023 12:32 PM GMTబాలీవుడ్ బ్యూటీ శ్వేత ధన్వంతరి వరస సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఛాన్స్ అందుకొని దూసుకుపోతోంది. అయితే, ఈ బ్యూటీ అచ్చ తెలుగు అమ్మాయి అనే విషయం చాలా మందికి తెలీదు. మొదట మోడలింగ్ తో తన కెరీర్ ని మొదలుపెట్టి, బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. హైదరాబాద్ నగరానికి ఈ చెందిన అ బ్యూటీ ఢిల్లీ పెరిగింది. వరంగల్ నీట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
శ్రేయాకి మొదటి నుంచి గ్లామర్ ఫీల్డ్ మీద ఆసక్తి ఎక్కువ. అందుకే, ఇంజినీరింగ్ చదువుతున్న సమయం నుంచే మోడలింగ్ పై ఫోకస్ పెట్టింది. ఆ సమయంలోనే ఆమె ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. అప్పుడు రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008లో ఫైనలిస్ట్ గా ఫోటీ పడింది.
ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగులో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో మెరిసింది. ఆ తర్వాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. అక్కడ చాలా సినిమాల్లో నటించింది. తెలుగులో జోష్ తో పాటు స్నేహ గీతం అనే మరో సినిమా కూడా చేసింది. ప్రముఖ వెబ్ సిరీస్ అమేజాన్ ఫ్రైమ్ లోనూ ఓ కీలక రోల్ ప్లే చేసింది. ఆ తర్వాత కూడా ఆమె కొన్ని వెబ్ సిరీస్ లలో కీలక పాత్రలు పోషించింది.
కాగా, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. తన ఫోటోలతో అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. బికినీల్లో సైతం సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతోంది.
ప్రింటెడ్ షర్ట్ ధరించి ఉన్న ఫోటోలను పంచుకుంది. షర్ట్ బటన్ తీసేసి ఉండటంతో, ఆమె ఎద అందాలు హైలెట్ అయ్యాయి. ఆమె ఓర చూపులు కూడా గుండెల్లో గుచ్చుతున్నట్లుగా ఉన్నాయి. దీంతో, ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఫోటోలు పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైకుల వర్షం కురవడం విశేషం. ఇక మంచి గ్లామరస్ పాత్రల కోసం చేస్తోన్న అమ్మడికి సరైన ఛాన్సులు మాత్రం రావడం లేదు. మరి ఈ స్టిల్స్ తో ఏవైనా కొత్త అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.