Begin typing your search above and press return to search.

పాపుల‌ర్ గాయ‌ని హ‌బ్బీ గురించి షాకిచ్చే నిజాలు?

ఆయ‌న 1400కోట్ల విలువైన ట్రూకాల‌ర్ లో కీల‌క బాధ్య‌త‌ల్ని నెర‌వేరుస్తున్నాడు

By:  Tupaki Desk   |   23 Jun 2024 3:51 AM GMT
పాపుల‌ర్ గాయ‌ని హ‌బ్బీ గురించి షాకిచ్చే నిజాలు?
X

శ్రేయా ఘోషల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. యువ‌త‌రం ప్ర‌తిభావ‌ని విన‌సొంపైన శ్రావ్య‌మైన‌ గాత్రంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కెరీర్ లో విభిన్న భాష‌ల్లో ఎన్నో అద్భుత‌మైన పాటల్ని ఆల‌పించిన శ్రేయా ప‌లుమార్లు జాతీయ ఉత్త‌మ గాయ‌నిగా అవార్డులను అందుకున్నారు. తెలుగులోను ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ ని ఆల‌పించింది. అయితే శ్రేయా ఘోష‌ల్ కుటుంబం, ఆమె భ‌ర్త గురించి అభిమానుల‌కు తెలిసింది చాలా త‌క్కువ‌.

స‌ద‌రు గాయ‌ని భర్త పేరు శిలాధిత్య ముఖోపాధ్యాయ. ఆయ‌న 1400కోట్ల విలువైన ట్రూకాల‌ర్ లో కీల‌క బాధ్య‌త‌ల్ని నెర‌వేరుస్తున్నాడు. ప్రముఖ కాలర్ ID స్పామ్-బ్లాకింగ్ యాప్ అయిన ట్రూకాల‌ర్ వృద్ధిలో అత‌డి పాత్ర అమోఘ‌మైన‌ది. 2022 ఏప్రిల్ నుండి ట్రూకాలర్ గ్లోబల్ హెడ్‌గా శిలాధిత్య తన సేవ‌ల‌ను అందిస్తున్నారు.

స్టాక్‌హోమ్‌ ప్రధాన కార్యాలయంలో 2009లో స్థాపించిన ట్రూకాల‌ర్ జనవరి-డిసెంబర్ 2023 ఆర్థిక సంవత్సరానికి SEK 1,740.4 మిలియన్ల (సుమారు రూ. 1406 కోట్లు) గణనీయమైన ఆదాయాన్ని క‌లిగి ఉంద‌ని నివేదిక‌లో పేర్కొంది. నెలవారీగా 374 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్‌లతో యాప్ దాని ఫీల్డ్‌లో ఆధిపత్యం చెలాయిస్తోంది. భారతదేశం నుంచి ప్రపంచ విక్రయాలలో గణనీయమైన షేర్ ను క‌లిగి ఉంది.

శిలాధిత్య ముఖోపాధ్యాయ పాత్ర ఈ వృద్ధిలో చాలా పెద్ద‌ది. ట్రూకాల‌ర్ వ్యాపార అభివృద్ధి, మొబైల్ అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో విస్తృతమైన నైపుణ్యాన్ని తీసుకువచ్చారు. ట్రూకాల‌ర్ కంటే ముందు అతడు కాలిఫోర్నియాలో ఉన్న ప్రముఖ సాస్ (SaaS) కంపెనీ అయిన క్లెవ‌ర్ టాప్ లో ఉన్నత పదవులను నిర్వహించాడు. అతడి విద్యాభ్యాస‌ నేపథ్యం ప‌రిశీలిస్తే.. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు.

ట్రూకాలర్ వృద్ధిలో త‌న పాత్ర గురించి ఇన్‌స్టా పోస్ట్‌లో షిలాధిత్య తన ఇటీవ‌లి పాత్ర గురించి ప్ర‌స్థావించారు. ప‌ని విష‌యంలో నిబ‌ద్ధ‌తను నొక్కి చెప్పారు. వినియోగదారులకు సురక్షితమైన విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌ను అందించే ప్రపంచ ఉత్పత్తులు, సేవలను మెరుగుపరచడంలో తన నిబద్ధతను నొక్కి చెప్పాడు.

శ్రేయా ఘోషల్ -శిలాదిత్య ముఖోపాధ్యాయ జంట‌ ప్రయాణం కూడా అంతే హృద్యమైన‌ది. చిన్ననాటి స్నేహితులు జీవిత భాగస్వాములుగా మారారు. వారు తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ తర్వాత 2015 లో వివాహం చేసుకున్నారు. 22 మే 2021న దేవయాన్ కి త‌ల్లిదండ్రులు అయ్యాక‌ వారి ఆనందం మ‌రింత‌గా విజ‌యాల వైపు దూసుకెళ్లేలా చేసింది.