భారీ కుంభకోణంలో ఫేమస్ ఆర్టిస్ట్!
బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే గురించి పరిచయం అసవరం లేదు. నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరుంది.
By: Tupaki Desk | 28 March 2025 7:15 AMబాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రేయాస్ తల్పాడే గురించి పరిచయం అసవరం లేదు. నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరుంది. ఇటీవల రిలీజ్ అయిన `పుష్ప2` చిత్రానికి వాయిస్ ఓవర్ అందించి బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే వివాదాల్లోనూ శ్రేయాస్ పేరు అంతే జోరుగా వినిపిస్తుంటుంది. ముఖ్యంగా ఆర్దిక మోసాల కేసుల్లో శ్రేయాస్ పేరు అగ్ర పధాన నిలుస్తుంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో కోట్లాది రూపాయల చిట్ ఫండ్ మోసం కేసులో శ్రేయాస్ తల్పాడే పేరు నమోదైంది.
అతడితో పాటు మరో 14 మందిపై కేసు నమోదైంది. మహోబా జిల్లాలో దశాబ్ద కాలంగా ఓచిట్ ఫండ్ కంపెనీ పేరిట భారీ కుంభ కోణానికి పాల్పాడినట్లు ఆరోపణలొస్తున్నాయి. అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ అండ్ థ్రిఫ్ట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కంపెనీ తో శ్రేయాస్ తల్పాడేకి సంబంధాలున్నట్లు ఆరోపణ లొస్తున్నాయి. అధిక వడ్డిలు ఆశ చూపి గ్రామస్తులను టార్గెట్ చేసి కంపెనీ ఎజెంట్లు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసారని, తక్కువ సమయంలో వారి పెట్టుబడులు రెట్టింపు అవుతాయని ఆశ చూపి ఆర్దిక మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు.
చట్ట పరమైన ప్రశ్నలు తలెత్తడంతో తీగ లాగితే ఈ డొంకంతా కదిలినట్లు తెలుస్తోంది. ఏజెంట్లు తమ కార్యకలాపాలను నిలిపివేసి జిల్లా నుండి అదృశ్యమయ్యారని సమాచారం. దీనికి సంబంధించి మహో బాలోన శ్రీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఆర్ధిక కుంభకోణాల్లో శ్రేయాస్ పేరు తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు.
ఫిబ్రవరిలో లక్నోలో శ్రేయాస్ సహా నటుడు అలోక్ నాథ్‌పై రూ.9 కోట్ల పెట్టుబడిదారులను మోసం చేశారనే ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించి గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అంతకు ముందు హర్యానాలోని సోనిపట్ లో జరిగిన బహుళ స్థాయి మార్కెటింగ్ మోసం కేసులో కూడా శ్రేయాస్ తల్పాడే పేరు వినిపించింది.