Begin typing your search above and press return to search.

'పుష్ప 2' హిందీ వ‌సూళ్ల‌కు అత‌డే ప్ర‌ధాన బ‌లం!

ముఖ్యంగా ఉత్త‌రాదిన ఈ సినిమా భారీ ఓపెనింగుల‌తో దుమ్ము రేపుతోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

By:  Tupaki Desk   |   7 Dec 2024 2:45 AM GMT
పుష్ప 2 హిందీ వ‌సూళ్ల‌కు అత‌డే ప్ర‌ధాన బ‌లం!
X

పుష్ప 2 మొద‌టి రోజు దేశ‌వ్యాప్తంగా 280 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింద‌ని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఆర్.ఆర్.ఆర్- ప‌ఠాన్ స‌హా చాలా సినిమాల ఓపెనింగ్ డే రికార్డుల‌ను ఈ సీక్వెల్ చిత్రం బ్రేక్ చేసింది. ముఖ్యంగా ఉత్త‌రాదిన ఈ సినిమా భారీ ఓపెనింగుల‌తో దుమ్ము రేపుతోంద‌ని ట్రేడ్ విశ్లేషిస్తోంది. 1000 కోట్లు సునాయాసంగా వ‌సూలు చేస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే పుష్ప అంత పెద్ద వేవ్ క్రియేట్ చేయ‌డం వెన‌క ప్ర‌ధాన బ‌లం ఈ సినిమా క‌థాంశ‌మా? అల్లు అర్జున్ న‌ట‌నా నైపుణ్య‌మా? అంటూ ఒక మేధో వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఈ సినిమాలో యాక్ష‌న్ ఎలివేష‌న్ సీన్లు, అల్లు అర్జున్ న‌ట‌న‌ను ఎలివేట్ చేసేందుకు క‌స‌ర‌త్తు చేసినంత‌గా క‌థ గురించి సుకుమార్ క‌స‌ర‌త్తు చేయ‌లేద‌ని విమ‌ర్శ ఉంది. అయినా ఆ లోపాన్ని క‌ప్పి పుచ్చే స్థాయిలో అల్లు అర్జున్ న‌టించార‌ని చ‌ర్చ సాగుతోంది.

అలాగే హిందీ బెల్ట్ లో అల్లు అర్జున్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పిన విధానం కూడా అక్క‌డ‌ ప్ర‌జ‌ల‌కు బాగా క‌నెక్ట‌యిపోయింద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్ కోసం డ‌బ్బింగ్ చెప్పిన ఆర్టిస్టు ఎవ‌రు? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అత‌డు మ‌రెవ‌రో కాదు శ్రేయాస్ త‌ల్ప‌డే. అత‌డి నైపుణ్యం పెద్ద ప్ల‌స్ అయింది. అయితే దీనికోసం అల్లు అర్జున్‌ని ఎప్పుడూ కలవలేదని..చ‌ర్చించ‌లేద‌ని శ్రేయాస్ త‌ల్ప‌డే చెప్పాడు. పుష్ప‌రాజ్ పాత్రలో ఇన్వాల్వ్ అయి ప‌ని చేసాన‌ని అన్నాడు. పుష్ప 2: ది రూల్ ఉత్త‌రాది బెల్ట్ లో గొప్ప వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అయితే హీరోతో మాట్లాడ‌కుండానే ఆ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్పాడు శ్రేయాస్. అల్లు అర్జున్‌తో తన పాత్ర గురించి తాను ఎప్పుడూ చర్చించలేదని, డబ్బింగ్ సమయంలో నోటిలో కాటన్ వేసి పుష్ప తాగే విధానం.. పొగాకు నమలడం వంటి సన్నివేశాలను తాను చేశానని శ్రేయాస్ తల్పాడే చెప్పారు. పాత్ర‌లో లీనం కావ‌డానికి తాను ఎంత‌గా ఇన్వాల్వ్ అయ్యాడో ఇది అర్థ‌మ‌య్యేట్టు చెబుతోంది.

దాదాపు ప‌ద్నాలుగు సార్లు టెస్టింగ్ జ‌రిగాక‌.. పుష్ప‌రాజ్ వాయిస్ లోని బేస్ సాధ్య‌మైంద‌ని కూడా అత‌డు చెప్పాడు. సన్నివేశాలను మళ్లీ రిపీట్ చేస్తూ అనువాదంలో ప‌ర్ఫెక్ష‌న్ కోసం అత‌డు ప్ర‌య‌త్నించాడు. ఈ సినిమాలో యాక్ష‌న్ స‌న్నివేశాలు.. డైలాగుల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉంది. అందుకే శ్రేయాస్ త‌ల్ప‌డే ప‌నిత‌నం కూడా దీనిలో బ‌య‌ట‌ప‌డింద‌ని కూడా టాక్ వినిపిస్తోంది.

పుష్ప 2 లో ఏదైనా లోపం ఉండి ఉండొచ్చు.. కానీ ఇందులో యాక్ష‌న్, డైలాగ్స్, బ‌న్ని న‌ట‌న లోపాల‌న్నిటినీ తుడిచిపెట్టేశాయ‌ని కూడా ట్రేడ్ విశ్లేషిస్తోంది. పేల‌వ‌మైన క‌థ‌ను కూడా క‌ప్పి పుచ్చేంత‌గా పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్ని న‌టించాడ‌ని కూడా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సుకుమార్ త‌న‌ను తాను మ‌రిచిపోయి బ‌న్ని పాత్ర‌ను ఎలివేట్ చేసాడ‌ని కూడా ప్ర‌శంస ద‌క్కింది.