Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ సినిమాల‌ కోసం శ్రేయాస్ అయ్యర్ వెయిటింగ్!

తాజాగా ప్ర‌భాస్ సిని మాల కోసం అభిమానులే కాదు ఓ స్టార్ క్రికెట‌ర్ కూడా అభిమానిని మించి ఆరాదిస్తాడు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   26 May 2024 8:30 AM GMT
ప్ర‌భాస్ సినిమాల‌  కోసం శ్రేయాస్ అయ్యర్ వెయిటింగ్!
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌డి సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. డార్లింగ్ సినిమా రిలీజ్ అవుతుందంటే పాన్ ఇండియాలో అభిమానుల‌ హంగామా మామూలుగా ఉండ‌దు. బాహుబ‌లి నుంచి మొద‌లైన విద్వంసం మొన్న‌టి 'స‌లార్' వ‌ర‌కూ ఎలా ఉందో చూసాం. పాన్ ఇండియాలో ఈరేంజ్ లో ఫేమ‌స్ అయిన ఒకే ఒక్క‌డు డార్లింగ్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

తాజాగా ప్ర‌భాస్ సిని మాల కోసం అభిమానులే కాదు ఓ స్టార్ క్రికెట‌ర్ కూడా అభిమానిని మించి ఆరాదిస్తాడు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇండియ‌న్ క్రికెట్ టీమ్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ఏ రేంజ్ ప్లేయ‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. విరాట్ కోహ్లీ త‌ర్వాత అంత‌గా ఫేమ‌స్ అవుతుంది అయ్య‌రే. అయితే ఈ చెన్నై ఆట‌గాడు ప్ర‌భాస్ కి వీరాభిమాని అన్న సంగతి వెలుగులోకి వ‌చ్చింది. 'బాహుబ‌లి సినిమాతోనే అభిమానిగా మారా.

అప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో ఫాలో అవుతూ ప్ర‌భాస్ గురించి..అత‌డి సినిమాల గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటున్నా. కోవిడ్ స‌మ‌యంలో డార్లింగ్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసాను. రోజంతా అత‌ని సినిమాల‌తోనే గ‌డిపేవాడిని. 'మిర్చి'లో ప్ర‌భాస్ చాలా అందంగా ఉంటాడు. ప్రస్తుతం లుంగీ లుక్లో రాబోతున్న 'రాజాసాబ్' కోసం..'స‌లార్ -2' కోసం ఎదురు చూస్తున్నా. అలాగే అమితాబ్ తో క‌లిసి న‌టించిన 'క‌ల్కీ 2898' కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాను.

మ్యాచ్ లు లేక‌పోతే రిలీజ్ అయిన మొద‌టి షోకే సినిమాల‌కు వెళ్తా. మ్యాచ్ లుంటే మాత్రం వీలుప‌డ‌దు. ఖాళీ స‌మ‌యం దొరికిన‌ప్పుడు ఓటీటీలో చూసుకోవ‌డ‌మే' అన్నారు. ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'క‌ల్కి'జూన్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. 'రాజాసాబ్' మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంద‌న్న‌ది క్లారిటీ లేదు. అలాగే 'స‌లార్ -2' వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.