ఐశ్వర్యారాయ్ కోడలిని టార్గెట్ చేసారు
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని పుకార్లను క్లియర్ చేసారు శ్రీమ రాయ్. ''నా పుట్టినరోజు నవంబర్ 21 .. ఎప్పటిలాగే పువ్వులు పంపారు.
By: Tupaki Desk | 30 Nov 2024 3:15 AM GMTసోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోవడం సులువుగా మారింది. ఇతరుల జీవితాల్లో తలదూర్చడం రంధ్రాన్వేషణ చేయడం చాలా వినోదం పంచుతుంది. ముఖ్యంగా నెటిజనులకు ఇది నిత్య వినోద సాధనంగా మారింది. ఇటీవల మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ వ్యక్తిగత జీవితాన్ని తవ్వి తీయడంలో.. కాపురంలో ఏం జరుగుతుందో ఆరాలు తీయడంలో నెటిజనులు చూపించిన ఉత్సాహం అంతా ఇంతా కాదు.
ఐశ్వర్యారాయ్- అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ మీడియాలో నిరంతరం కథనాలొస్తున్నాయి. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే దీనిపై మీడియాలు కథనాలు వైరల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. ఐశ్వర్యారాయ్ కోడలుపైనా హిందీ మీడియా దృష్టి సారించింది.
ఐశ్వర్య రాయ్ కోడలు శ్రీమ రాయ్ కెరీర్ కోసం కుటుంబం పేరును, ఐశ్వర్యారాయ్ పేరును ఉపయోగించుకున్నారా? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రఖ్యాత సోషల్ మీడియా ప్రభావశీల శ్రీమ రాయ్ నిజానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోడలు అని నెటిజనులు తమ ఆరాల్లో కనుగొన్నారు. ఆమె ఇండెంటిటీ పబ్లిక్ అయిన తర్వాత ఐశ్వర్య లేదా ఆమె కుమార్తె ఆరాధ్యతో ఫోటోలు ఎందుకు పోస్ట్ చేయలేదని జనం ప్రశ్నించడం ప్రారంభించారు. తర్వాత శ్రీమ తన కెరీర్లో పైకి ఎదగడానికి ఐశ్వర్యరాయ్ పేరును ఉపయోగించారా? అని చాలా మంది ప్రశ్నించడం ప్రారంభించారు. శ్రీమ ఈ రోజు ఇదే విషయాన్ని ఇన్ స్టాలో ప్రస్థావించారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని పుకార్లను క్లియర్ చేసారు శ్రీమ రాయ్. ''నా పుట్టినరోజు నవంబర్ 21 .. ఎప్పటిలాగే పువ్వులు పంపారు. అందరికీ కృతజ్ఞతలు తెలిపాను!'' అంటూ ఐశ్వర్య రాయ్ తల్లి.. ఆమె అత్తగారితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఐష్ తనకు చూపించిన మద్దతుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. తన వ్యాపార అభివృద్ధికి తనవారు సహకరించారని వారి మంచితనాన్ని కొనియాడారు శ్రీమ.