Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ నిర్మాత చెరువులో దూకారు: హీరోయిన్ శ్రీయ

ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 19 ఏళ్ల తర్వాత హీరోయిన్ శ్రియ.. నా అల్లుడు మూవీ గురించి మాట్లాడారు.

By:  Tupaki Desk   |   29 Oct 2024 12:50 PM GMT
ఎన్టీఆర్ నిర్మాత చెరువులో దూకారు: హీరోయిన్ శ్రీయ
X

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్లు శ్రియ శరణ్, జెనీలియా కలిసి నటించిన నా అల్లుడు మూవీ గుర్తుందా?.. విజయేంద్ర ప్రసాద్ క‌థ‌ అందించిన ఆ సినిమాకు వ‌ర ముల్ల‌పూడి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఏ. భారతి నిర్మించగా.. సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. అయితే 2005లో రిలీజ్ అయిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన 19 ఏళ్ల తర్వాత హీరోయిన్ శ్రియ.. నా అల్లుడు మూవీ గురించి మాట్లాడారు. హాట్ స్టార్ Show Time సిరీస్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. నా అల్లుడి మూవీ విషయాన్ని ప్రస్తావించారు. తాను తారక్, జెనీలియా ముగ్గురూ కలిసి ఓ మూవీ చేశామని చెబుతూ స్టార్ట్ చేశారు. ఆ సినిమా బడ్జెట్ కొన్ని కారణాల వల్ల బాగా పెరిగిపోయిందని తెలిపారు. నిర్మాత చాలా మంచోడని, ఎంతో ఫన్నీగా ఉండేవారని చెప్పారు.

మంచి సినిమా చేయాలని కష్టపడ్డారని, బడ్జెట్ పెరగడం వల్ల నిర్మాత కంగారు పడ్డారని తెలిపారు శ్రియ. షూటింగ్ లాస్డ్ డే అయ్యాక.. అందరికీ డబ్బులు ఇవ్వాలి కదా.. అప్పుడు ఏం చేయాలో తెలియక హైదరాబాద్ లేక్ (హుస్సేన్ సాగర్) లో దూకేశారని తెలిపారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదని, అక్క‌డ ఉన్న వారు కాపాడి ఒడ్డుకు తీసుకువ‌చ్చారని చెప్పారు. ఆ తర్వాత తాను తన సెటిల్ మెంట్ గురించి అడగలేదని తెలిపారు.

కానీ ఆ విషయం ఇప్పటికీ తలుచుకుంటే ఫన్నీగా అనిపిస్తుంటుందని చెబుతూ పగలబడి నవ్వారు శ్రియ. అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నా అల్లుడు మూవీ.. రూ.12 కోట్ల బడ్జెట్ తో రూపొందిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. సినిమా డిజస్టర్ గా మారినా.. తారక్ కు ఉన్న క్రేజ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయని వినికిడి.

అయితే శ్రియ ఇప్పుడు నా అల్లుడు మూవీ నిర్మాత చేసిన పని చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. అప్పుడు అలా జరిగిందా అని డిస్కస్ చేసుకుంటున్నారు. అదే సమయంలో నరసింహుడు మూవీ విషయంలో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మారడంతో నిర్మాత చెంగల వెంకట్రావ్.. హుస్సేన్ సాగర్ లో దూకి చనిపోవడానికి ప్రయత్నించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.