స్టార్ హీరో సినిమాలో శ్రియ స్పెషల్ సాంగ్
అలాంటి స్పెషల్ ఆఫర్లు వచ్చినప్పుడు చేయడం వల్ల భారీ రెమ్యూనరేషన్ తో పాటూ, నేషనల్ లెవెల్లో తమకు క్రేజ్ పెరగడం ఖాయం.
By: Tupaki Desk | 4 Feb 2025 5:33 AM GMTస్టార్ హీరోల సినిమాల్లో భారీ సినిమాల్లో ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ ఎక్కువైపోయాయి. స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ ఉందంటే ఆ సాంగ్ ఎవరు చేస్తున్నారా? ఆ పాట ఎలా ఉండబోతుందనే ఆసక్తి ముందునుంచే అందరిలో ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతున్న నేపథ్యంలో అగ్ర హీరోయిన్లు సైతం ఈ స్పెషల్ సాంగ్స్ చేయడానికి వెనుకడుగేయట్లేదు.
అలాంటి స్పెషల్ ఆఫర్లు వచ్చినప్పుడు చేయడం వల్ల భారీ రెమ్యూనరేషన్ తో పాటూ, నేషనల్ లెవెల్లో తమకు క్రేజ్ పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న రెట్రో సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఆ స్పెషల్ సాంగ్ ను శ్రియా శరణ్ చేస్తున్నట్టు సమాచారం. రెట్రో స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కలిసి శ్రియ కాలు కదిపినట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌ను వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
టాలీవుడ్ లో తన సినీ కెరీర్ ను మొదలుపెట్టిన శ్రియ ఆ తర్వాత తమిళ సినిమాల్లో కూడా నటించి కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించి అందరి మనసులు గెలుచుకున్న శ్రియ విదేశీ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైంది. తర్వాత మళ్లీ ఆర్ఆర్ఆర్ లో కనిపించిన శ్రియ తమిళ సినిమాలో కనిపించి చాలా కాలమే అవుతోంది. ఏడేళ్ల తర్వాత మళ్లీ తమిళ సినిమాలో చేయడం ఎంతో సంతోషంగా ఉందని శ్రియ ఈ సందర్భంగా తెలిపింది.
రెట్రో సినిమా సమ్మర్ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ సినిమా డిజాస్టర్ అవడంతో సూర్య తన ఆశలన్నీ రెట్రో సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య, ఆర్జె బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.