Begin typing your search above and press return to search.

నాలుగు పదుల వయసులో ఈ అందమేంటి శ్రియా

అమ్మడు తన కెరీర్ లో గ్లామర్ పాత్రలకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఇప్పుడు మళ్లీ ఓ బోల్డ్ అండ్ క్లాసీ లుక్‌తో సోషల్ మీడియా హీట్ పెంచింది.

By:  Tupaki Desk   |   23 March 2025 12:20 AM IST
నాలుగు పదుల వయసులో ఈ అందమేంటి శ్రియా
X

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో ఎనలేని అందంతో, నటనతో తనదైన ముద్ర వేసుకున్న శ్రియా సరన్ పేరు చెబితేనే ఓ గ్లామర్ గుర్తొస్తుంది. దాదాపు రెండు తరాల హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ బ్యూటీ, చాలా కాలంగా తన స్టన్నింగ్ లుక్స్‌తో సోషల్ మీడియాలోను షేక్ చేస్తోంది. అమ్మడు తన కెరీర్ లో గ్లామర్ పాత్రలకు ఎప్పుడూ వెనుకాడలేదు. ఇప్పుడు మళ్లీ ఓ బోల్డ్ అండ్ క్లాసీ లుక్‌తో సోషల్ మీడియా హీట్ పెంచింది.


ఈసారి శ్రియా ధరించిన డ్రెస్సు డిజైనర్ మనీష్ మల్హోత్రా స్పెషల్ కలెక్షన్ లోనిది. బ్లాక్ కలర్ డీప్-వీ బ్లౌజ్‌కు మ్యాచ్‌గా మెరిసే సీక్విన్ సారీ, రిచ్ టోన్ లో ఉండటంతో స్టైలిష్ లుక్ అందించడమే కాదు, ఆమె అందాన్ని మరింతగా హైలైట్ చేసింది. బ్యాక్ క్రాస్ బ్లౌజ్ డిజైన్ ఆమె స్టైల్ కి ఇంకొన్ని మార్కులు వేసింది. క్లాసీ హెయిర్ కర్ల్స్, మినిమల్ మేకప్, చిన్న బిందీతో ట్రెడిషనల్ టచ్ ఉండేలా ఆమె స్టైలింగ్ ప్లాన్ చేశారు.


ఈ ఫోటోషూట్ లో శ్రియా వేసిన ప్రతి పోజ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించింది. ఆమె మైనపు విగ్రహంలా కనిపించే లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసిన నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. "ఎజ్ జస్ట్ నంబర్", "ఫైరింగ్ లుక్", "గ్లామర్‌కు నిర్వచనం శ్రియానే" అనే కామెంట్లతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు పదుల వయసులో ఆ అందమేంటి శ్రియా అంటూ మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఆమె ఫిట్‌నెస్ చూసి ఆమె వయస్సు ఊహించలేం అనే స్థాయిలో నెటిజన్లు స్పందిస్తున్నారు.


ఇన్ స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలతో పాటు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అక్షయ్ తీసిన క్లిక్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ కి మేకప్, జ్యువెల్రీ, హెయిర్ స్టైల్ అన్నీ కాంప్లిమెంట్ గా పనిచేశాయి. నెక్స్ట్ ఆమె పలు బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఇలాంటి స్టైలిష్ లుక్స్ షేర్ చేస్తూ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తోంది. శ్రియా సరన్ సారీ లుక్ లో ఇచ్చిన ఈ స్టన్నింగ్ ఫోటోషూట్ మరోసారి రుజువు చేసింది.. ఆమె వయసు పెరుగుతున్నా, ఆమె గ్లామర్ మాత్రం రోజురోజుకీ రెట్టింపు అవుతోందని.