Begin typing your search above and press return to search.

ఇంత వేడిలో ఇదేమి డ్రెస్సు? శ్రీ‌యను నిల‌దీసిన పెద్దావిడ‌!

శ్రియా శరణ్ బుధవారం ముంబైలో ఒక ప్రివ్యూ షోకి హాజ‌రైంది. అక్క‌డ త‌న‌ను ఒక వృద్ధ మహిళ అట‌కాయించింది.

By:  Tupaki Desk   |   18 April 2024 3:25 PM GMT
ఇంత వేడిలో ఇదేమి డ్రెస్సు? శ్రీ‌యను నిల‌దీసిన పెద్దావిడ‌!
X

శ్రీ‌య ఎక్క‌డ ఉంటే సెన్సేష‌న్ అక్క‌డ ఉంటుంది. సెల‌బ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అంద‌రూ త‌న‌నే చూడాల‌నేది త‌న మైండ్ సెట్. దానికి త‌గ్గ‌ట్టుగానే త‌న‌ ప్ర‌త్యేక‌త‌ను నిలుపుకుంటూ.. ఎప్ప‌టికీ అదే ఎన‌ర్జీతో గొప్ప ఫ్యాష‌న్ సెన్స్ తో మైమ‌రిపిస్తూనే ఉంది ఈ బ్యూటీ. త‌న భ‌ర్త ఆండ్రూ కోశ్చీవ్ తో ప‌బ్లిక్ గా చుంబ‌నాలు, కౌగిలింత‌ల‌తోను అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ బ్యూటీ ఒక బిడ్డ‌కు మామ్ అయ్యాకా ఎక్క‌డా త‌గ్గేదే లే అంటోంది.

శ్రియా శరణ్ బుధవారం ముంబైలో ఒక ప్రివ్యూ షోకి హాజ‌రైంది. అక్క‌డ త‌న‌ను ఒక వృద్ధ మహిళ అట‌కాయించింది. ఇంత‌ వేడి వాతావరణంలో ఇలాంటి డ్రెస్ తొడుక్కున్నావేంటి? అని నిల‌దీసింది. ఈ ఘటన కెమెరాకు చిక్కడంతో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆ పెద్దావిడ‌ శ్రియను పట్టుకుని తాను ధ‌రించిన‌ దుస్తులను ఎత్తి చూపుతూ ఇంత‌ వేడిలో అలాంటి బట్టలు ఎలా ధరించగలవు? అని ప్రశ్నించింది. అంతేకాదు.. ఏసీల‌కు అల‌వాటు ప‌డిన నువ్వు బ‌య‌టి వాతావరణాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.

కానీ ఆ సంద‌ర్భంలో శ్రియ ఎంతో తెలివిగా సీన్ ని మ్యానేజ్ చేసేసింది. చక్కటి హాస్యంతో త‌మ చుట్టూ ఉన్న ఫోటోగ్రాఫర్‌ల ముందు నవ్వుతూ క‌నిపించింది. ప్రివ్యూ థియేటర్‌లోకి ప్రవేశించే ముందు ``దేఖా? ఐసా హోతా హై`` అంటూ స‌ర‌సమాడింది. నిజానికి ప‌సుపురంగు డిజైన‌ర్ డ్రెస్ లో శ్రీ‌య అంత సౌక‌ర్యంగా క‌నిపించ‌లేదు. బాగా పొట్టిగా తొడ‌ల‌పైకి తేలిపోతున్న బాట‌మ్ వేర్ తోను ఇబ్బంది ప‌డింది. కానీ దానిని క‌నిపించ‌నీకుండా శ్రీ‌య మేనేజ్ చేసేసింది.

విద్యాబాలన్ - ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన `దో ఔర్ దో ప్యార్` స్క్రీనింగ్‌కు హాజరైన ఈ బ్యూటీ చాలా సింపుల్ మేక‌ప్ తో క‌నిపించింది. తాజా ఎన్‌కౌంటర్ చూశాక‌ ఇబ్బందికరమైన పరిస్థితులను తెలివిగా మ్యానేజ్ చేయ‌డ‌మెలానో నేర్పుతుంది. శ్రీ‌య‌కు అజయ్ దేవగన్ `దృశ్యం` ఫ్రాంచైజీ మంచి పేరు తెచ్చిన సంగ‌తి తెలిసిందే.