Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ పాలిటిక్స్ పై శ్రియ మ‌న‌సులో మాట‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్రానికి ఉప‌ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   8 Aug 2024 8:23 AM GMT
ప‌వ‌న్ పాలిటిక్స్ పై శ్రియ మ‌న‌సులో మాట‌!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్రానికి ఉప‌ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంత్రిగా ప‌ని చేయ‌డంతో ఆయ‌న అభిమానులంతా ఇప్ప‌టికే విషెస్ తెలియ‌జేసారు. ఇరువురు రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల‌ని..ఈ ఐదేళ్ల పాల‌న దేశానికే త‌ల‌మానికంగా నిల‌వాల‌ని అభిమానులంతా కోరుకుంటున్నారు.

ఇక ఇండ‌స్ట్రీ నుంచి ప‌వ‌న్ కి ఎంతో మంది మ‌ద్ద‌తు తెలిపిన సంగతి తెలిసిందే. ప‌వ‌న్ కూడా ఇండ‌స్ట్రీ వ్య‌క్తి కావ‌డంతో ప‌రిశ్ర‌మ ప‌క్ష‌పాతి అని బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం తెలియ‌జేసారు. అందుకు త‌గ్గ‌ట్టే `క‌ల్కి 2898` టికెట్ ధ‌ర‌లు పెంచుకునే వెసులు బాటు సైతం క‌ల్పించారు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా సీనియ‌ర్ న‌టి శ్రియ ప‌వన్ క‌ళ్యాణ్ కి ఆల‌స్యంగా విషెస్ తెలియ‌జేసింది.

ప‌వ‌న్ విజ‌యం విష‌యంలో నేనెంతో గ‌ర్వంగా ఉన్నా. మేమిద్ద‌రం గ‌తంలో `బాలు` సినిమాలో క‌లిసి న‌టించాం. అత‌ను ఎంతో సైలెంట్. త‌న ప‌ని తాను చూసుకుంటారు. ఎంతో అంకిత భావం ఉన్న వ్య‌క్తి. `బాలు` లో ఓ పాట షూటింగ్ జ‌రుగుతోన్న స‌మ‌యంలో ప‌వ‌న్ కాలికి గాయ‌మైంది. కానీ ఆ విష‌యం పాట షూటింగ్ మొత్తం పూర్త‌య్యే వ‌ర‌కూ ఎవ‌రికీ చెప్ప‌లేదు. చెబితే షూట్ డిస్ట‌ర్బ్ అవుతుంద‌ని చెప్ప‌కుండా దాచి పెట్టారు.

పవన్ ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనుకుంటారు. ఆయ‌న‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న కోరిక అది. ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల‌కు తన ఉత్తమమైన సేవలందిస్తారని ఆశిస్తున్నాను` అని అంది. ఇక శ్రియ సెకెండ్ ఇన్నింగ్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికీ అవ‌కాశాలు అందుకుంటూ బిజీ న‌టిగా కొన‌సాగుతుంది. ఇలా ఛాన్సులు అందుకోవ‌డం మాత్రం శ్రియ‌కే చెల్లింది అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.