విజయ్ సినిమాలో మరో హీరోయిన్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ తో మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 9 Feb 2025 6:40 AM GMTహెచ్. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ చివరి సినిమాగా జన నాయగన్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి సినిమా కావడంతో జన నాయగన్ పైన అందరికీ మంచి అంచనాలతో పాటూ సినిమాపై భారీ క్రేజ్ ఉంది.
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ తో మరో హీరోయిన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. ఓ కీలక పాత్ర కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు శృతి హాసన్. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ నిజమైతే మాత్రం శృతి మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందనే చెప్పొచ్చు. వీరిద్దరూ కలిసి 2015లో పులి సినిమా చేశారు. విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాలో శృతి హాసన్ ఆయనకు భార్యగా నటించింది. కానీ పులి అప్పట్లో డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు మళ్లీ పదేళ్ల తర్వాత దళపతి విజయ్ తో కలిసి శృతి నటించబోతుంది. రెండోసారి విజయ్ తో కలిసి నటిస్తున్న ఈ సినిమా అయినా హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పులి టైమ్ లో శృతి హాసన్ డిజాస్టర్లలో ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు మాత్రం అమ్మడు సినిమా చేసిందంటే అది హిట్ అవుతుంది.
ఇదిలా ఉంటే విజయ్ ఈ సినిమాకు ముందు చివరిగా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇక జన నాయగన్ సినిమా విషయానికొస్తే ఈ సినిమా రాజకీయ ప్రధానాంశంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.