వివక్ష ఇంకా కొనసాగుతోంది... శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు
ఈ సమయంలో హీరోయిన్ శృతి హాసన్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 8 March 2025 12:21 PM ISTఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు ఆడవారి గొప్పతనం గురించి షేర్ చేస్తున్నారు. హీరోయిన్స్ మాత్రమే కాకుండా హీరోలు దర్శక నిర్మాతలు సైతం మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. ఈ సమయంలో హీరోయిన్ శృతి హాసన్ చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆడవారు ఒకప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఇప్పటికి చాలా సమస్యలను ఎదుర్కొంటున్న ఆడవారు ఉన్నారు. నా తల్లి హీరోయిన్‌గా ఉన్న సమయంలో పడ్డ ఇబ్బందుల గురించి ఎన్నో సార్లు చెప్పింది. ఆమె నెలసరి సమయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.
సినిమా ఇండస్ట్రీలో మహిళల హక్కులు ఎలా హరించారు అనే విషయాలను తన తల్లి సారికతో పాటు ఎంతో మంది సీనియర్ నటీమనులు చెప్పినట్లు శృతి హాసన్ తన పోస్ట్‌లో పేర్కొంది. సమానత్వంకు చాలా దూరంలో పరిస్థితులు ఉండేవి. మహిళలకు సెట్స్‌లోనే కాకుండా అన్ని చోట్ల చాలా తక్కువ ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వబడేది. రుతుస్రావం సమయంలో నిషిద్ద మనుషులుగా చూసేవారే విషయాన్ని కూడా అమ్మ తనతో చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఆ రోజుల్లో రుతుస్రావం గురించి కనీసం బయటకు చెప్పే పరిస్థితి ఉండేది కాదట. ఆ విషయం గురించి మాట్లాడకుండా ఇబ్బందులు పడుతూనే షూటింగ్‌లో పాల్గొన్న సందర్భాలు చాలానే ఉండేవట అని శృతి హాసన్ తెలియజేసింది.
అప్పటి పరిస్థితులతో పోల్చితే కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు మహిళలు రుతుస్రావం గురించి బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ విషయంపై స్వేచ్చగా మాట్లాడే అవకాశంను నేటి తరం కల్పించారు. ఇప్పుడు ఆడవారు ఆరోగ్యం బాగాలేదు, షూటింగ్ లో పాల్గొనలేను అంటే అర్థం చేసుకుంటారు. ఆ విషయంలో కాస్త ఊరట కలిగినా ఇతర కొన్ని విషయాల్లో ఇప్పటికీ ఆడవారికి, మగవారికి మధ్య వ్యత్యాసం చాలా ఉంది. సమానత్వం అనేది సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది అంటూ శృతి హాసన్ అసహనం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లోనూ ఆడవారికి సమానమైన గౌరవం దక్కే రోజులు రావాలని ఆమె కోరుకుంది.
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు బాలీవుడ్‌లో ఒక సినిమా, హిందీ వెబ్ సిరీస్‌లోనూ శృతి హాసన్ నటిస్తోంది. ఇక ఈమె ప్రభాస్ సినిమా సలార్ 2 లోనూ కీలక పాత్రలో నటించనుంది. హీరోయిన్‌గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలు, సిరీస్‌లను చేసేందుకు ఈ అమ్మడు రెడీగా ఉంది. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఎంతటి సాహసానికి అయినా శృతి హాసన్ రెడీ అంటుంది. ముందు ముందు ఈమె నుంచి మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.