శ్రుతిహాసన్ కలల డైరెక్టర్ ఎవరో తెలుసా?
విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతి హాసన్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి రాణిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 March 2025 10:30 AMవిశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా శ్రుతి హాసన్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళ, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించింది. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఎంతో మంది హీరోలతో ..మరెంతో మంది స్టార్ డైరెక్టర్లతో పనిచేసింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా పనిచేయాలనే డైరెక్టర్ ఎవరు? అంటే వెంటనే మణిరత్నం పేరు చెబుతుంటారు.
ఆయన జానర్ మంచి రొమాంటిక్ స్టోరీల్లో నటించాలని ఆశ పడుతుంటారు. ఆ తర్వాత శంకర్ పేరు వినిపిస్తుంది. ఇండియన్ సినిమాలో వీళ్లిద్దరు ఎంతో ప్రత్యేకమైన డైరెక్టర్లు. కాలం మారినా..తరాలు మారినా? వాళ్లతో పనిచేయడం అన్నది ప్రతీ నటి ఓ డ్రీమ్గా భావిస్తుంది. కానీ శ్రుతి హాసన్ డ్రీమ్ లో ఆ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు లేరు. శ్రుతి హాసన్ కలల డైరెక్టర్ ఎవరు? అంటే యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు చెప్పింది.
ఈయన పట్టు మని పది సినిమాలు కూడా తీయలేదు. చేసింది నాలుగైదు సినిమాలే. అయితే దర్శకుడిగా తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. పాన్ ఇండియా మార్కెట్ లో లోకేష్ అంటే ఓబ్రాండ్. తనకంటూ ఓ యూనివర్శ్ ని క్రియేట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడతను సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా `కూలీ` చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇందులో శ్రుతి హాసన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా శ్రుతి హాసన్ డ్రీమ్ `కూలీ` చిత్రంతో నెర వేరుతుంది. ఈ సినిమా కంటే ముందే అమ్మడు లోకష్ తో కలిసి ఓ యాడ్ షూడ్ లో రొమాంటిక్ గానూ నటించింది. ఆ షూట్ తర్వాత ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.