Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ సీక్రెట్‌గా అలాంటి ప‌ని

త‌న త‌ల్లిదండ్రుల కార‌ణంగా త‌న‌లో ఆధ్యాత్మిక భావాలు ఎలా పెరిగాయో కూడా శ్రుతి తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   30 Dec 2024 2:30 AM GMT
స్టార్ హీరోయిన్ సీక్రెట్‌గా అలాంటి ప‌ని
X

క‌మ‌ల్ హాస‌న్- సారిక దంప‌తుల కుమార్తె శ్రుతిహాస‌న్. త‌న త‌ల్లిదండ్రులు విడిపోవ‌డంతో అది త‌న‌పై ఎలాంటి ప్ర‌భావం చూపిందో ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో శ్రుతిహాస‌న్ వెల్ల‌డించింది. త‌న త‌ల్లిదండ్రుల బ్రేక‌ప్ ప్ర‌భావం త‌న‌పై చాలా ఎక్కువ‌. కార‌ణం ఏదైనా పెళ్లికి తాను దూరంగా ఉంటాన‌ని శ్రుతి చెప్పింది. పెళ్లి వ‌ద్ద‌నుకోవ‌డానికి త‌న కార‌ణాలు త‌న‌కు ఉన్నాయి.

త‌న త‌ల్లిదండ్రుల కార‌ణంగా త‌న‌లో ఆధ్యాత్మిక భావాలు ఎలా పెరిగాయో కూడా శ్రుతి తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. త‌న ఇల్లు నాస్తికుల ప్ర‌పంచం అని.. దానివ‌ల్ల దేవాల‌యాల‌కు వెళ్ల‌డం నిషేధ‌మ‌ని కూడా తెలిపింది. త‌న తండ్రి క‌మల్ హాస‌న్ నాస్తికుడు. కానీ త‌న త‌ల్లి సారిక ఆధ్యాత్మిక బాట‌ను అనుస‌రించార‌ని తెలిపింది.

ఓసారి త‌న ఇంట్లో ఉన్న కండీష‌న్ వ‌ల్ల ర‌హ‌స్యంగా దేవాల‌యానికి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. అది కూడా త‌న తాత‌గారితో క‌లిసి వెళ్లింద‌ట‌. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ శృతి ఇలా వెల్లడించింది. ``మా కాలనీలో నేను సైకిల్ తొక్కే ఒక లేన్ ఉంది. ప్రధాన ద్వారం దగ్గర రైడ్ చేయవద్దని నాపై కండీష‌న్‌. కొన్ని కారణాల వల్ల ప్రతిరోజూ ఉదయం నేను చర్చి, గుడి గంటలను ఒకే సమయంలో వింటాను. నేను దేనిని ముందుగా చేరుకోవాలో ఆలోచిస్తాను. గుడి మా ఇంటికి చాలా దూరంలో ఉంది కాబట్టి నేను వారానికోసారి చర్చికి వెళ్లేదానిని. ఐదారు నెలలైనా ఇంట్లో ఎవరికీ తెలియదు. పిల్లలు స‌హ‌జంగానే వారికి ఏదైనా చేయవద్దని చెబితే.. వారు దానిని మరింత ఎక్కువగా చేస్తారు`` అని తెలిపింది.

శృతి మ‌ర‌పురాని జ్ఞాపకాలలో ఒకదానిని గుర్తు చేసుకుంది. త‌న దివంగ‌త‌ తాత‌య్య గారితో క‌లిసి మొదటిసారి ఆల‌యాన్ని సంద‌ర్శించాన‌ని తెలిపింది. తాతయ్య నన్ను చెన్నైలోని ఒక ఆలయానికి తీసుకెళ్లారు. నన్ను గుడికి తీసుకెళ్లిన‌ట్టు నాన్నకు చెప్పవద్దని చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి తాతయ్య చనిపోయారు. నేను ఎప్పుడూ మా తాతతో మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నాను. దేవాలయం ఆధ్యాత్మిక సంబంధంలా మారింది``అని జ్ఞాప‌కాల్లోకి వెళ్లింది శ్రుతి. రెండుసార్లు ప్రేమ‌లో విఫ‌ల‌మైన శ్రుతి హాస‌న్ ప్ర‌స్తుతానికి పెళ్లి ఊసెత్త‌డం లేదు. కెరీర్‌పైనే పూర్తిగా శ్ర‌ద్ధ వ‌హించింది. ఈ బ్యూటీ త‌దుప‌రి సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ తో కూలీలో న‌టిస్తోంది. లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.