Begin typing your search above and press return to search.

శ్రుతి హాస‌న్ క‌ర్ర‌సాము..గిర‌గిరా తిప్పుతూ!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా ప‌రిశ్ర‌మ‌కి ఎంట్రీ ఇచ్చిన శృతిహాస‌న్ జ‌ర్నీ ప్ర‌తిభ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు మ‌ల్టీట్యాలెంటెడ్. న‌టిగా..గాయానిగా..కంపోజర్ గా..మ్యూజిక్ బ్యాండ్ నిర్వాహ‌కురాలిగా ఎంట్రీకి ముందే ప్ర‌తిభ‌ని చాటుకుంది. న‌టిగా ఆరంభంలో వైఫ‌ల్యం ఎదురైనా? ఏమాత్రం నెర‌వ‌కుండా జ‌ర్నీ ప్లాన్ చేసుకుని ముందుకు సాగి స‌క్సెస్ అయింది. ఆ స‌క్సెస్ నేడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రం వ‌ర‌కూ దారి తీసింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీ కాంత్ క‌థా నాయ‌కుడిగా లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `కూలి` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రుతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఎలాంటి హింట్ ఇవ్వ‌లేదు. కానీ ఇందులో ఆమె పాత్ర శ‌క్తివంతంగా ఉంటుంద‌ని తాజా లీక్ ను బ‌ట్టి తెలుస్తోంది. ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మెప్పించ‌బోతున్న‌టు తెలుస్తుంది. సినిమాలో పాత్ర కోసం ప్ర‌త్యేకంగా క‌ర్ర‌సాము నేర్చుకుంటుంది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అమ్మ‌డు క‌ర్ర‌ని రెండు చేతుల‌తో గిరా గిరా తిప్పుతూ మంచి ప్రావీణ్యం సంపాదించిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో సినిమాలో శ్రుతి హాస‌న్ పాత్ర కీల‌కంగానే క‌నిపిస్తుంది. మ‌రి ఈ క‌ర్ర‌సాము ట్రైన‌ర్ ఎవ‌రు? అన్న‌ది తెలియాలి. క‌ర్ర‌సాములో డాడ్ క‌మ‌ల్ హాస‌న్ మంచి ఎక్స్ ప‌ర్ట్. ఆయ‌న హీరోగా న‌టించిన `దేవ‌ర్ మ‌గ‌న్`( క్ష‌త్రియ పుత్రుడు) సినిమాలో క‌ర్ర‌సాము విద్య‌ను ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆసినిమా కోసం ప్ర‌త్యేకంగా నేర్చుకున్నాడు. తాజాగా త‌న‌య కూడా క‌ర్ర‌సాములో ప్రావీణ్యం సంపాదించ‌డం విశేషంగా చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   1 Sep 2024 11:30 PM GMT
శ్రుతి హాస‌న్ క‌ర్ర‌సాము..గిర‌గిరా తిప్పుతూ!
X

c అమ్మ‌డు మ‌ల్టీట్యాలెంటెడ్. న‌టిగా..గాయానిగా..కంపోజర్ గా..మ్యూజిక్ బ్యాండ్ నిర్వాహ‌కురాలిగా ఎంట్రీకి ముందే ప్ర‌తిభ‌ని చాటుకుంది. న‌టిగా ఆరంభంలో వైఫ‌ల్యం ఎదురైనా? ఏమాత్రం నెర‌వ‌కుండా జ‌ర్నీ ప్లాన్ చేసుకుని ముందుకు సాగి స‌క్సెస్ అయింది.

ఆ స‌క్సెస్ నేడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రం వ‌ర‌కూ దారి తీసింది. ప్ర‌స్తుతం ర‌జ‌నీ కాంత్ క‌థా నాయ‌కుడిగా లోకేష్ క‌న‌గరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `కూలి` అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో శ్రుతి హాస‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఎలాంటి హింట్ ఇవ్వ‌లేదు. కానీ ఇందులో ఆమె పాత్ర శ‌క్తివంతంగా ఉంటుంద‌ని తాజా లీక్ ను బ‌ట్టి తెలుస్తోంది.

ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో మెప్పించ‌బోతున్న‌టు తెలుస్తుంది. సినిమాలో పాత్ర కోసం ప్ర‌త్యేకంగా క‌ర్ర‌సాము నేర్చుకుంటుంది. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అమ్మ‌డు క‌ర్ర‌ని రెండు చేతుల‌తో గిరా గిరా తిప్పుతూ మంచి ప్రావీణ్యం సంపాదించిన‌ట్లు క‌నిపిస్తుంది. దీంతో సినిమాలో శ్రుతి హాస‌న్ పాత్ర కీల‌కంగానే క‌నిపిస్తుంది. మ‌రి ఈ క‌ర్ర‌సాము ట్రైన‌ర్ ఎవ‌రు? అన్న‌ది తెలియాలి.

క‌ర్ర‌సాములో డాడ్ క‌మ‌ల్ హాస‌న్ మంచి ఎక్స్ ప‌ర్ట్. ఆయ‌న హీరోగా న‌టించిన `దేవ‌ర్ మ‌గ‌న్`( క్ష‌త్రియ పుత్రుడు) సినిమాలో క‌ర్ర‌సాము విద్య‌ను ప్ర‌ద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆసినిమా కోసం ప్ర‌త్యేకంగా నేర్చుకున్నాడు. తాజాగా త‌న‌య కూడా క‌ర్ర‌సాములో ప్రావీణ్యం సంపాదించ‌డం విశేషంగా చెప్పొచ్చు.