Begin typing your search above and press return to search.

త‌ల్లిదండ్రుల కార‌ణంగా మ‌ద్యానికి బానిసైన న‌టి?

తన త‌ల్లిదండ్రుల కార‌ణంగా ఆల్క‌హాల్ కి బానిస‌య్యాన‌ని అంగీక‌రించిన నేటిత‌రం క‌థానాయిక శ్రుతిహాస‌న్ గురించి నేటిత‌రంలో ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   31 Dec 2024 6:30 PM GMT
త‌ల్లిదండ్రుల కార‌ణంగా మ‌ద్యానికి బానిసైన న‌టి?
X

గ్లామ‌ర్ రంగంలో తార‌ల‌పై ఒత్తిళ్లు అసాధార‌ణ‌మైన‌వి. కొన్నిసార్లు వ్య‌క్తిగ‌త, కుటుంబ‌ జీవితంలో ఆటుపోట్లు మ‌ద్యానికి బానిస‌లుగా మార్చిన సంద‌ర్భాలున్నాయి. తన త‌ల్లిదండ్రుల కార‌ణంగా ఆల్క‌హాల్ కి బానిస‌య్యాన‌ని అంగీక‌రించిన నేటిత‌రం క‌థానాయిక శ్రుతిహాస‌న్ గురించి నేటిత‌రంలో ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతోంది.

శ్రుతి హాస‌న్ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర క‌థానాయిక‌గా ఎదిగినా కానీ, వ్య‌క్తిగ‌త జీవితంలో తీవ్ర‌మైన ఆటుపోట్ల‌ను ఎదుర్కొంది. లైఫ్ జ‌ర్నీలో తీవ్ర‌మైన ఒత్తిళ్ల‌ను చ‌వి చూసింది. అమ్మా నాన్న క‌మ‌ల్ హాస‌న్- సారిక విడాకులు తీసుకున్నారు. దీంతో శ్రుతి హాస‌న్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అంగీక‌రించింది. డిప్రెష‌న్ కార‌ణంగా తాను మ‌ద్యానికి అల‌వాటు ప‌డ్డాన‌ని వెల్ల‌డించింది. త‌న‌కు కేవ‌లం 18 వ‌య‌సు ఉన్న‌ప్పుడే అమ్మా నాన్న విడిపోవ‌డం బాధించింద‌ని శ్రుతి పేర్కొంది.

ఇది ఒక్క‌టే కాదు.. శ్రుతిహాస‌న్ జీవితంలో కొన్ని పెద్ద‌ ప‌రిణామాలు ఉన్నాయి. రెండుసార్లు త‌న జీవితంలో బ్రేక‌ప్ అయింది. విదేశీ ప్రేమికుడు మైఖేల్ కోర్స‌లేని ప్రేమించిన శ్రుతిహాస‌న్ అత‌డిని పెళ్లాడేందుకు సిద్ధ‌మైంది. త‌న తల్లిదండ్రులు క‌మ‌ల్ హాస‌న్- సారిక‌ల‌కు మైఖేల్ ని ప‌రిచ‌యం చేసింది. కొన్నాళ్ల పాటు ఈ జంట లివిన్ రిలేష‌న్ షిప్ కొన‌సాగింది. కానీ ఆ బంధం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు. ఆ త‌ర్వాత కొంత కాలం పాటు డిప్రెష‌న్ కొన‌సాగింది. కొన్నేళ్లకు కెరీర్ ప‌రంగా న‌టిగా కంబ్యాక్ అయ్యాక‌.. డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికాతో శ్రుతిహాస‌న్ ప్రేమాయ‌ణం పెద్ద‌గా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ బంధం ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు. శంతనుతోను బ్రేక‌ప్ అయి ప్ర‌స్తుతం ఒంట‌రిగా ఉంది. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో రిలేష‌న్ షిప్స్ ఎక్కువ కాలం కొన‌సాగ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మైన‌ద‌ని శ్రుతిహాస‌న్ అంగీక‌రించింది. పెళ్లిపై త‌న‌కు అంత‌గా న‌మ్మ‌కం లేద‌ని కూడా వ్యాఖ్యానించింది. త‌న త‌ల్లిదండ్రుల విడాకుల ప్ర‌హ‌స‌నం త‌న‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేసింద‌ని వెల్ల‌డించింది.

ఇటీవ‌ల శ్రుతిహాస‌న్ త‌న న‌ట‌నా కెరీర్ పై శ్ర‌ద్ధ పెడుతోంది. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో కూలీ చిత్రంలో న‌టిస్తోంది. విక్ర‌మ్, ఖైదీలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ లోకేష్ క‌న‌గ‌రాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇంత‌కుముందు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో క‌లిసి ఓ ఆల్బ‌మ్ లోను శ్రుతిహాస‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆల్బ‌మ్ కి మంచి క్రేజ్ వ‌చ్చింది.