Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన అందం

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తండ్రి పేరును ఎప్పుడూ వాడుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగేందుకు ప్రయత్నించింది

By:  Tupaki Desk   |   31 Dec 2024 4:30 PM GMT
పిక్‌టాక్‌ : బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిన అందం
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తండ్రి పేరును ఎప్పుడూ వాడుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగేందుకు ప్రయత్నించింది. మొదటి నుంచి కమల్‌ కూతురు అని కాకుండా తన నటన గురించి, తన ప్రత్యేకతల గురించి మాట్లాడుకోవాలని తాపత్రయ పడింది. మొదటి సినిమా ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరచినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రయత్నాలు చేసింది. పవన్‌ కళ్యాణ్‌తో ఈమె నటించిన గబ్బర్‌ సింగ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. అదే స్థాయిలో సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

గబ్బర్‌ సింగ్‌ తర్వాత శృతి హాసన్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. టాలీవుడ్‌లో మొదటి హిట్‌ కొట్టిన ముద్దుగుమ్మ శృతి హాసన్‌కి బాలీవుడ్‌లోనూ మంచి ఆఫర్లు దక్కాయి. పాన్‌ ఇండియా స్థాయిలో అన్ని భాషల సినిమాల్లోనూ నటిస్తూ దూసుకు పోతుంది. తెలుగు, తమిళ్‌, హిందీ, కన్నడ భాషల సినిమాల్లో కనిపిస్తూ అన్ని భాషల ప్రేక్షకుల అభిమానంను సొంతం చేసుకుంది. ఛాలెంజింగ్‌ పాత్రలను చేసేందుకు ఆసక్తి చూపించే శృతి హాసన్‌ చివరకు ఐటెం సాంగ్స్‌కి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉంటుంది.

తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉంటుంది. దాదాపు 25 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న శృతి హాసన్‌ ఆకట్టుకునే అందంతో ఉన్నఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి లైఫ్‌ స్టైల్‌ రిపోర్టర్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ పై కన్నుల విందు చేసింది. ఎప్పుడూ విభిన్నంగా కనిపించేందుకు ప్రయత్నించే శృతి హాసన్‌ ఈసారి అంతకు మించి అన్నట్లుగా బ్లాక్ డ్రెస్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి ఆకట్టుకుంది. ఈ స్థాయి అందం హాలీవుడ్‌ రేంజ్‌ అందం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఫోటోలను తెగ లైక్‌ చేస్తున్నారు.

సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు సలార్‌ 2 లోనూ కీలక పాత్రలో కనిపించబోతుంది. సలార్‌ 2 సినిమా షూటింగ్‌ ఇప్పటికే సగానికి పైగా పూర్తి అయ్యింది. బ్యాలన్స్ వర్క్‌ను వచ్చే ఏడాదిలో షూట్‌ చేసి సినిమాను 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని మేకర్స్ అంటున్నారు. సలార్‌ 2 సినిమా షూటింగ్‌ కోసం ప్రభాస్ ఎప్పటి నుంచి డేట్లు ఇస్తాడు అనేది చూడాలి. సలార్‌ 2 మాత్రమే కాకుండా పలు హిందీ సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లో తెలుగు, తమిళ్‌ చిత్రాల్లోనే ఈ అమ్మడు వచ్చే ఏడాది నటించబోతుంది. ఇక ఇలాంటి అందమైన ఫోటో షూట్స్‌, కవర్‌ స్టిల్స్‌తో సోషల్‌ మీడియాను షేక్ చేస్తూనే ఉండబోతుంది.