ముచ్చటగా మూడవసారి శ్రుతిహాసన్ లవ్ లోనా?
ప్రేమలో పాఠాలు..గుణ పాఠాలు శ్రుతిహాసన్ కి కొత్తేం కాదు.
By: Tupaki Desk | 12 Sep 2024 3:30 PM GMTప్రేమలో పాఠాలు..గుణ పాఠాలు శ్రుతిహాసన్ కి కొత్తేం కాదు. తొలిసారి మైఖెల్ కోర్సలేతో ప్రేమలో పడింది. అతడితో కొన్నాళ్ల పాటు డీప్ లవ్ లో మునిగి తేలింది. ప్రియుడిని చెన్నై తీసుకొచ్చి డాడీకి పరిచయం చేసింది. ముగ్గురు కలిసి లంచ్ ..డిన్నర్...పార్టీలు కూడా ఆస్వాదించారు. అలా కొంత కాలం బాగానే సాగింది. తర్వాత ఇద్దరి మధ్య విబేధాలొచ్చాయి. దీంతో ప్రేమకి పుల్ స్టాప్ పడింది.
ఈ క్రమంలో శ్రుతి హాసన్ ఎంతో మనోవేదనకు గురైంది. మైఖెల్ కోసం కెరీర్ ని సైతం పళంగా పెట్టింది. వచ్చిన అవకాశాలు ఎన్నో వదులుకుంది. అతడి మత్తులో కోట్లాది రూపాయల పారితోషంక కాలద న్నుకుంది. ఇది శ్రుతి హాసన్ కెరీర్ లో కోలుకోలేని దెబ్బ కొట్టిన లవ్ స్టోరీగా మిగిలిపోయింది. దీంతో అమ్మడు మళ్లీ ప్రేమ లో పడే ఛాన్స్ లేదని భావించారు.
కానీ మొదటి బ్రేకప్ తో సంబంధం లేకుండా డూడల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో రెండవ సారి లవ్ లో పడింది. ఇతగాడితోనే బాగానే ఆస్వాదించింది. తొలి ప్రయత్నం తో వచ్చిన అనుభవంతో రెండవసారి మాత్రం జాగ్రత్త పడింది. శంతను తో మరీ అంతడీప్ గా వెళ్లకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఈ మధ్య ఆ బంధానికి కూడా స్వస్తి పలికింది. ఇలా శ్రుతి హాసన్ కెరీర్ లో రెండు బ్రేకప్ లున్నాయి.
ఈ రెండు గుణ పాఠాలు తర్వాతైనా వెనక్కి తగ్గుతుందా? అటే అదేం లేదని అమ్మడు మూడవ సారి లవ్ స్టోరీకి సిద్దమైనట్లు వినిపిస్తుంది. సొగసరి ఓ అజ్ఞాతవాసి లవ్ లో ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఆ బంధాన్ని మీడియా ముందుకు కూడా తీసుకురాబోతుందని వినిపిస్తుంది. మరి ఇది ప్రచారమా? లేక నిజమా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శ్రుతి హాసన్ కెరీర పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.