Begin typing your search above and press return to search.

జాన్వీ స‌రే.. ఎవ‌రీ మ‌రాఠా సుంద‌రి?

ఇప్పుడు తెలుగు సినిమాకి ప‌రిచ‌యం అవుతున్న‌ మ‌రాఠా సుంద‌రి శృతి.పి. మ‌రాఠే గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 7:23 AM GMT
జాన్వీ స‌రే.. ఎవ‌రీ మ‌రాఠా సుంద‌రి?
X

న‌దియా, ఇంద్ర‌జ‌, పంక‌జం రోజులు పోయాయ్! ఇప్పుడు కొత్త కొత్త క్యారెక్ట‌ర్ న‌టీమ‌ణులు తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాకి ప‌రిచ‌యం అవుతున్న‌ మ‌రాఠా సుంద‌రి శృతి.పి. మ‌రాఠే గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర చిత్రంలో శృతి న‌టించారు.


దేవరలో తార‌క్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తుండ‌గా, ఈ సినిమాలో కొడుకు పాత్ర కోసం జాన్వీ కపూర్ ని ఎంపిక చేసుకున్నారు కొర‌టాల‌. తండ్రి పాత్ర అయిన `దేవర`కు భార్యగా మరాఠీ నటి శృతిని తీసుకున్నారు. శృతి మ‌రాఠీ గుజ‌రాత్ లో జ‌న్మించి మ‌రాఠా సినీరంగంలో త‌న‌దైన ముద్ర వేసారు.


అయితే ఇప్ప‌టికే ప‌రిచ‌యం ఉన్న పాపుల‌ర్ న‌టీమ‌ణుల‌తో కాకుండా ఒక కొత్త న‌టీమ‌ణిని ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణం ఆ పాత్ర‌లో ఉన్న యూనిక్ నెస్ అని కొర‌టాల చెబుతున్నారు. 2008లో స‌నై చోగ‌డే అనే మ‌రాఠా చిత్రంతో న‌టిగా ఆరంగేట్రం చేసిన శృతి ఆ త‌ర్వాత క‌న్న‌డం, హిందీ, త‌మిళంలోను న‌టించింది. ఇప్పుడు తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది.

అయితే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాతో ప‌రిచ‌యం అవుతుండ‌డం ఈ భామ అదృష్టం అని చెప్పాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా పేజీల్లో శ్రుతి వేగంగా వైర‌ల్ అయిపోతోంది. తెలుగులో ప్ర‌వేశిస్తున్న జాన్వీ క‌పూర్ తో స‌మానంగా ఈ అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కునుంది. శృతి మ‌రాఠీ అంద‌చందాలు, హావ‌భావాల‌కు యూత్ ఫిదా అయిపోతుండ‌డం విశేషం. మ‌రాఠా సుంద‌రి ఇన్ స్టా పేజీ శృతి పి మ‌రాఠీ నుంచి చాలా ఫోటోల‌ను ఇప్పుడు అభిమానులు వైర‌ల్ చేస్తున్నారు.