Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ 15 ఏళ్ల ప్ర‌యాణం సాగిందిలా!

ఇక అమ్మ‌డు మ‌ల్టీట్యాలెంటెడ్ అన్న‌సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 July 2024 4:30 PM GMT
స్టార్ కిడ్  15 ఏళ్ల ప్ర‌యాణం సాగిందిలా!
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాస‌న్ సినీ ప్ర‌యాణం దేదీప్య‌మానంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళం, తెలుగు, హిందీ భాష‌ల్లో ఇప్ప‌టికే స‌త్తా చాటింది. స‌లార్ విజ‌యంతో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఇక అమ్మ‌డు మ‌ల్టీట్యాలెంటెడ్ అన్న‌సంగ‌తి తెలిసిందే. న‌టి కాక ముందే సింగ‌ర్ గా, మ్యూజిక్ కంపోజ‌ర్ గా ఆరితేరింది.

ఎన్నో స్టేజ్ షోలు చేసింది. మ్యూజిక్ బ్యాండ్ ని నిర్వ‌హించి త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన బ్రాండ్ఇమేజ్ ని సంపాదించుకుంది. తాజాగా ఈ న‌టి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు పూర్తవుతుంది. శ్రుతిహాస‌న్ డాడ్ కమల్ హాసన్ స్వీయా ద‌ర్శ‌క‌త్వ‌లో తెరకెక్కించిన `హే రామ్‌` చిత్రంతో తెరంగేట్రం చేసింది. అందులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. అంత‌కు ముందే ఆరేళ్ల వయసులో 1992 తమిళ చిత్రం `తేవర్ మగన్‌` ప్లేబ్యాక్ సింగర్‌గా తన వృత్తిని ప్రారంభించింది.

అందులో క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత 2009లో హిందీలో `లక్` అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అటుపై `అన‌గ‌న‌గా ఓ ధీరుడు` అనే సినిమాతో తెలుగులోనూ లాంచ్ అయింది. కానీ ఈ రెండు చిత్రాలు శ్రుతి హాస‌న్ కి తీవ్ర విమ‌ర్శ‌లే తెచ్చి పెట్టాయి. వెనుక బ్యాక‌ప్ ఉన్నా? న‌టిగా ప‌ని కొస్తుందా? అన్న విమ‌ర్శ‌లు సైతం ఎదుర్కుంది. ఆ త‌ర్వాత కాల క్ర‌మంలో వాటినే స‌వాళ్లు గా తీసుకుని ప్ర‌శంస‌లు గా మార్చుకుంది.

`గబ్బర్ సింగ్` విజ‌యం టాలీవుడ్ లో ఆమె కెరీర్ని ట‌ర్న్ చేసింది. ఆ హిట్ తో అమ్మ‌డి ద‌శ తిరిగిపోయింది. అప్ప‌టినుంచి టాలీవుడ్లో అవ‌కాశాలు ఊపందుకున్నాయి. ఇక్క‌డ వ‌చ్చిన క్రేజ్ తో నే కోలీవుడ్ లోనూ అవ‌కాశాలు రావ‌డం మొద‌లైంది. `శ్రీమంతుడు`, `ఎవడు`,` క్రాక్`, `రేసుగుర్రం`.. `వాల్తెరు వీరయ్య`.. `సలార్` లాంటి ఎన్నో విజ‌యాల్లో భాగమైంది. ఇప్ప‌టివ‌ర‌కూ శ్రుతి హాస‌న్ ఐదు భారతీయ భాషలలో 45 చిత్రాలలో నటించింది. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రభాస్‌తో `సలార్ 2`, అడివి శేష్‌తో `డెకాయిట్`, రజనీకాంత్‌తో `కూలీ` సినిమాలు చేస్తోంది. ఇంకా క‌న్ప‌మ్ చేయాల్సిన ప్రాజెక్ట్లు మ‌రికొన్ని ఉన్నాయి.