ఐటమ్ పాట కొన్ని సీన్లకే అంత తీసుకుందా?
కరోనా క్రైసిస్ సమయంలో మెయింటెనెన్స్ కి లేక అప్పులు తీర్చలేక, తన ఫ్లాట్ ను కూడా అమ్ముకున్నానని తెలిపింది శ్రుతిహాసన్
By: Tupaki Desk | 3 Dec 2023 1:30 PM GMTకరోనా క్రైసిస్ సమయంలో మెయింటెనెన్స్ కి లేక అప్పులు తీర్చలేక, తన ఫ్లాట్ ను కూడా అమ్ముకున్నానని తెలిపింది శ్రుతిహాసన్. కానీ క్రైసిస్ సమయంలోనే వరుసగా బంపర్ హిట్ చిత్రాల్లో నటించి కంబ్యాక్ ని ఘనంగా చాటుకుంది శ్రుతి. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ప్రభాస్ తో పాన్ ఇండియా చిత్రం సలార్ లో నటించిన ఈ బ్యూటీ నాని సినిమాలోను ఒక పాటలో నర్తించింది. పలు క్రేజీ చిత్రాలకు శ్రుతి సంతకాలు చేసింది.
నాని -మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'హాయ్ నాన్న' క్రేజీ చిత్రాలలో ఒకటి. కుటుంబ కథాచిత్రాల స్పెషలిస్ట్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు. 7 డిసెంబర్ 2023న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో శృతిహాసన్ అతిధి పాత్రలో కనిపించనుంది. దీని నుంచి స్పెషల్ పాట ఒడియమ్మా కొన్ని రోజుల క్రితం విడుదలై ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రుతి ఒక ఐటమ్ పాట కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది. శ్రుతిహాసన్ కేవలం కొన్ని సన్నివేశాలు పాటల కోసం ఏకంగా 90 లక్షలు వసూలు చేసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
శృతి పెద్ద హీరోలతో నటించే నైపుణ్యం ఉన్న అగ్ర నటి. కాబట్టి హాయ్ నాన్నాలో అతిథి పాత్ర చేసినా అది మార్కెట్ కి కలిసొస్తుందని అంచనా. బేబి కియారా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మృణాల్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించింది. నాని పెద్ద హిట్ కొడతానని ధీమాతో ఉన్నాడు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. అన్నట్టు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్న శ్రుతిహాసన్ తన పాత అప్పులన్నిటినీ క్లియర్ చేసేసిందా? అంటే దానికి సమాధానం రావాల్సి ఉంది.